వామ్మో:నయన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సరికొత్త రంగంలోకి అడుగులు..!!

Divya
నయనతార-విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా వీరిద్దరూ కలిసి సంతోషంగా తిరుగుతున్నారు. ఇక నయనతార ఎన్నో లవ్ బ్రేకప్ ల తర్వాత విఘ్నేష్ శివన్ తో చాలా సంతోషంగా గడుపుతోంది. అయితే త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కావడానికి సిద్ధమయ్యారు. అందుకోసం వీరి దాంపత్య జీవితంలో ఎలాంటి కలతలు కలగకుండా ఉండేందుకు ఎన్నో పూజలు సైతం చేయిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నట్లు సమాచారం. ఇక వివాహం అనంతరం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది.
ఈ బ్యానర్ పై సరికొత్త సినిమాలను నిర్మిస్తూ ముందుకు సాగిపోతున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ జంట దుబాయ్ కి చెందిన ఒక ఆయిల్ కంపెనీలో ఏకంగా 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన్నట్లుగా సమాచారం. ఇక అందుకు సంబంధించిన విషయాలను పూర్తిగా తెలుసుకొని వీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ప్లాన్ చేశారు అన్నట్లుగా కోలీవుడ్ మీడియా వర్గాలలో బాగా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే వీరిద్దరూ సక్సెస్ అవ్వడం ఖాయమని వీరి అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక ఆయిల్ కంపెనీలు ఎప్పుడైనా లాభదాయకమైన వ్యాపారమే అని చెప్పవచ్చు.
ఎంతోమంది ఇక పెద్ద పెద్ద ప్రముఖులు ఈ రంగంలో అడుగు పెట్టి బాగా సక్సెస్ అయ్యారు. ఇక వారి అడుగు జాడల్లోనే ఈ జంట నడిచే విధంగా ప్లాన్ చేశారు. మనం కూడా ఈ జంట సక్సెస్ కావాలని కోరుకుందాం. ఏది ఏమైనా వీరిద్దరూ తమ వృత్తి పరంగా చాలా బిజీగా ఉన్నారు. నయనతార సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటోంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: