చిరంజీవితో జనసేనకు నష్టం కలగనుందా?

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి టిక్కెట్ల వ్యవహారం పై మాట్లాడటానికి ఏపి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.. ఈ విషయం పై ఇప్పుడు రక రకాల పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినీ ఇండస్ట్రీ , అటు ఎపి రాజకియాల్లొ కూడా వేడి వాతావరణం ఏర్పడింది.. ఇండస్ట్రీ కి న్యాయం చెస్తానని వెళ్ళి జగన్ కు సపోర్ట్ చెయ్యడం తో అందరు చిరు పై కోపంగా ఉన్నారు. మరోవైపు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 



గత రెండున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై పవన్ యుద్ధం చేస్తున్నారు. వైసీపీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఫైట్ చేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వెళ్ళి ఇలా చేయడం తో కాపుల్లొ అసహనం మొదలైంది. ఇప్పుడు చిరంజీవి ఇలా చేయడంతో అందరిలొ మరో సందిగ్దత మొదలైంది. నిజం చెప్పాలంటే చిరు ఇప్పుడు రాజకియాలకు చాలా దూరంగా ఉండి, సినిమాలను చేసుకుంటూన్నారు. మెగా అభిమానులు కూడా అయోమయం లో ఉన్నారు. 



ప్రస్తుతం వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. జగన్ కూడా తెలివిగా చిరంజీవినే ముందుపెడుతున్నట్లు కనిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో అనేకమంది పెద్ద నటులు ఉన్నారు. వారందరిని ఒకసారి పిలిచి మాట్లాడి వుంటే కొంతవరకూ బాగుండును. అలా కాకుండా జగన్ కేవలం చిరును మాత్రమే పిలవడం అనేక అనుమానాల కు దారి తీస్తుంది. చిరంజీవి సినిమా టిక్కెట్ల అంశం పై పరిష్కారం దొరికిందో లేదో క్లారిటీ ఇవ్వకుండా, జగన్ మంచి విందును ఏర్పాటు చేశారు. జగన్ ప్రజల మనిషి అంటూ ఏదేదో చెప్తున్నారు.. జన శ్రేణులు కూడా ఈ విషయం పై చర్చలు చెస్తున్నారు.. ఇది ఎప్పుడూ తెలుతుందో చూడాలి.. 

చిరంజీవి ఇప్పుడు వరుస సినిమలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అవి కూడా విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: