చైతు ఆ విషయం లో ఇంప్రూవ్ అయినట్లే!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు వరుస విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లడం అక్కినేని కాంపౌండ్ ను ఎంతగానో సంతోషపెడుతుంది. గతంలో సినిమాల ఎంపికలో లోపల వల్ల నాగచైతన్య వరసగా ఫ్లాపులను ఎదుర్కొనేవారు. దానికి తోడు ఆయన నటన కూడా పేలవంగా ఉండడంతో ఆ సినిమా తనకు ఏవిధంగా ఉపయోగపడేది కాదు. కానీ ఇటీవల కాలంలో ఆయనలో మంచి పరినితి వచ్చిందని వారు చెబుతున్న నేపథ్యంలో సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తూ నాగచైతన్య వరుస సినిమాలతో సూపర్ హిట్లు కొడుతున్నాడు.

అంతేకాదు ఒక సినిమాకి ఒక సినిమాకి మంచి వైవిధ్యత కూడా చూపిస్తూ తనలోని అన్ని రకాల నటులను బయటకు తీసుకు వస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం విడుదలై సూపర్ హిట్ సాధించింది. అప్పటివరకు లవర్ బాయ్ గా యాక్షన్ హీరోగా కనిపించిన నాగ చైతన్య ఈ సినిమా లోని బంగారు రాజు పాత్రలో సరికొత్త గా కనిపించి ప్రేక్షకులను మెప్పించి క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా లో నాగార్జునది గెస్ట్ రోల్ లాంటి పాత్ర కావడం తో నాగచైతన్య ఈ సినిమాను తన భుజాల మీద వేసుకొని నడిపించడం జరిగింది.

ఆ విధంగా గత కొన్ని సినిమాలుగా నాగచైతన్య లో వచ్చిన పరిణితి నీ చూసి అక్కినేని కాంపౌండ్ ఎంతగానో సంతోషపడుతుంది. భవిష్యత్తులో కూడా అక్కినేని నాగచైతన్య ఇదేవిధంగా దూసుకుపోతే అగ్ర హీరోల జాబితాలో చేరడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య సినిమాలు కూడా ఎంతో వైవిధ్యంతో కూడుకున్నది కావడం గమనార్హం. మజిలీ సినిమా తర్వాత ఆయన చేసిన లవ్ స్టోరీ ఇప్పుడు బంగార్రాజు చిత్రాలు వరసగా సూపర్ హిట్ లు కావడం వైవిధ్య భరితమైన సినిమాలు గా పేరు తెచుకోవడం అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: