మహేష్ కు ఎందుకు సంక్రాంతి అంటే అంతిష్టం!!

P.Nishanth Kumar
ఒక్కొక్కరు ఒక సీజన్ లో తమ సినిమాలను విడుదల చేస్తూ హిట్ లు అందుకుంటూ ముందుకు పోతూ ఉంటారు మన హీరోలు. ఆ విధంగా సంక్రాంతి సీజన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఎంతో ప్రత్యేకమైనది. ఆయన నటించిన సినిమాల్లో అగ్రభాగం చిత్రాలు సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సాధించుకున్నాయి. ఆఖరికి ఆయన గత చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సినిమా ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా మిగిలింది అంటే సంక్రాంతి సీజన్లో విడుదల కావడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. 

మహేష్ బాబు అంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ ఉంది. టాప్ 5 హీరోల్లో ఒకరైన మహేష్ బాబుకు కేవలం తెలుగు రాష్ట్రంలలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మంచి ఇమేజ్ ఉంది. సోషల్ మీడియాలో సైతం ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన సోషల్ మీడియాలో రికార్డులను సృష్టించే విధంగా అత్యధిక ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ యాక్టర్ గా ఆయన రికార్డులకెక్కాడు ట్విట్టర్లో. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉన్న అన్ని విధాలుగా క్రేజ్ ఉండడంతో ఇతర భాషల వారు సైతం ఆయన సినిమాలను చూడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. 

ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సంక్రాంతికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ జరగని కారణంగా వేసవిలో ఈ చిత్రం విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. ఇక ఆ తర్వాత ఆయన త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. మరి మహేష్ బాబుకు సంక్రాంతి సీజన్ అంటే ఎందుకు అంత ఇష్టం తెలియదు కానీ ఆమె ఇష్టానికి తగ్గట్లుగానే ఈ సీజన్ లో విడుదలైన ప్రతి సినిమా భారీ వసూళ్లు సాధించి ఆయన కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆయనను సూపర్ స్టార్ గా చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: