సమంత కోసం ఆ పని చేస్తున్న త్రివిక్రమ్!!

P.Nishanth Kumar
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకునే విధంగా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. విడాకుల తర్వాత ఆమె సినిమాల్లో మళ్లీ మునుపటిలా బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా ఆమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులందరినీ భారీగా ఆకర్షించింది. ఈ పాటలో ఆమె నటించడం ద్వారా ఆమెకు మంచి బూస్ట్ వచ్చిందనే చెప్పాలి ఒకసారి ప్రేక్షకుల అందరిలో ఆమె ఆసక్తిని కలిగించింది. ఈ ఐటెం సాంగ్ లో నటించిన తర్వాత ఆమె వరుస సినిమాల్లో చేసే విధంగా ఆమె ప్రణాళికలు వేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది గుణశేఖర్ దర్శకత్వంలో నిషా కుంతలం సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అలాగే యశోద అనే మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించింది ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ విధంగా రెండు సినిమాలతో మళ్లీ తన సత్తా చాటడానికి రెడీ అవుతుంది సమంతా.

 కానీ పెద్ద హీరోల పెద్ద దర్శకనిర్మాతల సపోర్ట్ ఆమెకు లేకపోవడం ఇప్పుడు ఆమె పెద్ద సినిమాల్లో నటించక పోవడానికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే ఆమె గతంలో బాగా క్లోజ్ గా ఉండే దర్శక హీరోలకు టచ్ లోకి వెళ్ళింది అని తెలుస్తుంది. ముఖ్యంగా ఆమెకు బాగా సన్నిహితుడైన త్రివిక్రమ్ తో ఆమె మంతనాలు జరుపుతుందట. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకత్వంలో మహేష్ హీరోగా చేయబోయే సినిమాలో సమంత ను పెట్టుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నడట. అంతేకాదు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈమెను హీరోయిన్ గా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు తన నిర్మాణంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా సమంతను నటింప చేసే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: