దుబాయ్‌లో ఆ హీరోయిన్ పెట్టుబ‌డులు తెలిస్తే షాకే..?

హీరోల‌తో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా త‌క్కువ‌ని చెప్ప‌డానికి పెద్ద‌గా సందేహించాల్సిన ప‌నిలేదు. ఏ భాషా చిత్రాల్లో న‌టించే క‌థానాయిక‌ల‌కైనా ఇదే వ‌ర్తిస్తుంది. క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాల సంఖ్య బాగా త‌గ్గి, కేవ‌లం గ్లామ‌ర్ డాల్ పాత్ర‌ల‌కే హీరోయిన్లను ప‌రిమితం చేసే సినిమాల సంఖ్య పెరిగాక చాలామంది నాలుగైదు చిత్రాల త‌రువాత తెర‌మ‌రుగైపోతున్నారు కూడా. అయితే చాలా కొద్దిమంది మాత్ర‌మే దీనికి మిన‌హాయింపు. వారిలో ద‌శాబ్ద‌కాలం పైగా క‌థానాయిక‌లుగా రాణించ‌గ‌లిగిన‌వారినైతే వేళ్ల‌మీద లెక్కించ‌వ‌చ్చు. ద‌క్షిణాదిన ఇలా చెప్పుకోద‌గిన హీరోయిన్ న‌య‌న‌తార‌. నాలుగు ప‌దుల వ‌య‌సుకు స‌మీపిస్తున్నా ఇంకా ఆమె క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.  2018లోనే ఫోర్బ్స్ ఇండియా సెల‌బ్రిటీస్ 100 లిస్టులో చేరిన ఘ‌న‌త ఆమె సొంతం.

 
ఎప్పుడో 2003లో ఓ మ‌ల‌యాళ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన న‌య‌న్ ఆ త‌రువాత 2005లో అయ్యా చిత్రం ద్వారా త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న చంద్ర‌ముఖి చిత్రంలో అవ‌కాశం దక్కించుకుంది. ఆ త‌రువాత ఇక ఆమె స్టార్ హీరోయిన్ అనిపించుకోవ‌డానికి ఎంతో స‌మ‌యం తీసుకోలేదు.  దాదాపు ద‌శాబ్దానికి పైగానే తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో అగ్ర హీరోలంద‌రితోనూ న‌టించి ఇప్ప‌టికీ టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. క‌థానాయిక ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తూ ద‌క్షిణాదిన అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నహీరోయిన్‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు న‌య‌న‌తార కొత్త వ్యాపారాల్లో కూడా భారీగానే పెట్టుబ‌డులు పెడుతోంద‌ట‌. గ‌ల్ఫ్‌ దేశ‌మైన దుబాయ్‌కు చెందిన‌ ఓ చమురు కంపెనీలో న‌య‌న‌తార రూ. 100 కోట్ల‌కు పైగా ఇన్వెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో హీరో శింబుతోను, ద‌ర్శ‌కుడు, డ్యాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవాతోను ప్రేమాయ‌ణం సాగించిన ఈ భామ ప్ర‌స్తుతం విఘ్నేశ్ శివ‌న్‌తో డేటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ ఓ చిత్ర నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి సినిమాలు కూడా తీస్తున్నారు. వీరిద్ద‌రూ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను దుబాయ్‌లో జ‌రుపుకోవ‌డంతో కొత్త వ్యాపారం పనిమీదే అక్క‌డ‌కు వెళ్లార‌ని కోలీవుడ్ సినిమా వ‌ర్గాల్లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక న‌య‌న‌తార చెన్నైలో అత్యంత ఖ‌రీదైన పోయ‌స్ గార్డెన్ ప్రాంతంలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసిన‌ట్టు త‌మిళ సినీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: