ఈ స్టార్ సెలబ్రిటీస్ ఒక‌ప్పుడు క్లాస్ మేట్స్ అని మీకు తెలుసా?

VUYYURU SUBHASH
సాధార‌ణంగా సెలబ్రెటీస్ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి సామాన్యులు తెగ ఇంట్ర‌స్ట్ చూపుతుంటారు. అయితే సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ప్ర‌స్తుత రోజుల్లో ఏ విష‌య‌మైనా ఇట్టే తెలిసిపోతోంది. ఇకపోతే బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ సెలబ్రిటీలు గా కొనసాగుతున్న వారు ఒక‌ప్పుడు క్లాస్ మేట్స్‌. మ‌రి ఆ స్టార్ సెల‌బ్రిటీస్ ఎవ‌రు..? వారు ఎక్క‌డ చ‌దువుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


నాని- ప్ర‌దీప్‌: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న్యాచుర‌ల్ స్టార్‌గా త‌న‌కంటూ చిన్న సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న‌ నానికి.. యాంక‌ర్ క‌మ్ హీరో ప్రదీప్ మాచిరాజు క్లాస్ మేట్‌. వీరిద్ద‌రూ హైదరాబాద్లోని సెంట్ అల్ఫోన్సా స్కూల్‌లో క‌లిసి చ‌దువుకున్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలో నాని, ప్ర‌దీప్‌లు స్వ‌యంగా పేర్కొన్నారు. అంతే కాదు, తామిద్దరం స్కూల్లో టాపర్స్, అయితే చ‌దువులో అనుకుంటే పొర‌పాటే. స్కూలు బిల్డింగ్ మీదకు ఎక్కి సొల్లు చెప్పుకునే వాళ్లం, అలా టాప్ పొజిషన్ లో నిలబడి ముచ్చట్లు చెప్పుకోవడం వల్ల టాపర్స్ అయ్యాము అంటూ స‌ర‌ద‌గా చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్- రానా- శర్వానంద్: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో త‌మ‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, రానా ద‌గ్గుబాటి, శ‌ర్వానంద్‌లు కూడా ఒక‌ప్పుడు క్లాస్ మేట్సే. ఈ ముగ్గురు హీరోలు హైదరాబాద్‌లో బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క‌లిసి చ‌దువుకున్నారు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన వచ్చేది కాదు. కానీ, చివ‌ర‌కు ముగ్గురూ స్టార్స్‌గా ఎదిగారు.

అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్: బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా స‌త్తా చాటుతున్న మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌లు కూడా బాల్యంలో క‌లిసే చ‌దువుకున్నారు.

అనుష్క శ‌ర్మ‌-సాక్షి: బాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అనుష్క శ‌ర్మ‌, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షిలు సైతం క్లాస్ మేట్సే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: