ఈ విషయం లో ప్రభాస్ ఎందుకు వెనుకబడుతున్నాడు..!!
అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను విడుదల చేసి ఈ చిత్ర నిర్మాతలు తమ బాధ్యతను నెరవేర్చుకునే వారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఒక్కసారిగా అందరూ నిరాశ పడ్డారు. అయితే ప్రభాస్ ఈ ఒక్క సినిమా అప్డేట్ లు ఇచ్చే విషయంలోనే వెనకబడ్డాడు అనుకుంటే ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి సినిమాల అప్డేట్ ల విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది.
సంక్రాంతి సందర్భంగా అందరూ హీరోలు కూడా తమ అభిమానులను ఖుషీ చేసే విధంగా వారు నటించే నటించబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను విడుదల చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏదో విధమైన సర్ప్రైజ్ సిద్ధం చేసి అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన చిత్రాలకి సంబంధించిన అప్డేట్స్ ను సంక్రాంతికి విడుదల చేస్తారని చెప్పకపోవడంతో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఆయన అభిమానులు. మరి నిర్మాతలను అని ఏం లాభం మన హీరోకి అభిమానులను సంతృప్తి పరచాలన్న ఆలోచన లేదు కదా.. అదే ఉంటే తప్పకుండా ఆ పని చేస్తాడు అని వారిలో వారే సర్ది చెప్పుకుంటున్నారు అభిమానులు.