అయ్యబాబోయ్ ఐదు సినిమాలా.. 2022 పూజా నామ సంవత్సరం.. !

shami
టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే దుమ్ముదులిపేస్తుంది. స్టార్ హీరో సినిమా అంటే ముంద్దు అమ్మడిని హీరోయిన్ గా అడిగి ఆమె కాదన్నాకే మరొకరికి ఆ ఛాన్స్ వస్తుంది. పూజా హెగ్దే సినిమాలో ఉంది అంటే గ్లామర్ షోకి ఏమాత్రం అడ్డు అదుపు ఉండదని చెప్పొచ్చు. తన స్కిన్ షోతో సినిమాకు కావాల్సిన హాట్ ఇమేజ్ తెస్తున్న పూజా హెగ్దే తన పాపులారిటీని రోజు రోజుకి పెంచుకుంటుంది. ఈ క్రమంలో పూజా హెగ్దే 2022 లో దాదాపు ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కలుపుకుని పూజా హెగ్దే 2022 లో నాలుగైదు సినిమాలతో సందడి చేయనుంది. అందులో దళపతి విజయ్ బీస్ట్.. చిరు, చరణ్ ల ఆచార్య.. ప్రభాస్ రాధే శ్యాం.. రణ్ వీర్ సింగ్ తో చేస్తున్న సర్కస్ సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ అవనున్నాయి. త్రివిక్ర శ్రీనివాస్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో కూడా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తునని తెలుస్తుంది. ఈ ఐదు సినిమాలు ఈ ఏడాది వస్తే 2022 నిజంగానే పూజా నామ సంవత్సరం గా మారుతుందని చెప్పొచ్చు.
చేసే సినిమాలు ఏవైనా సరే ఆడియెన్స్ ని అలరించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గని పూజా హెగ్దే తన ఫాలోయింగ్ ని సినిమా సినిమాకి పెంచేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో వచ్చే సినిమాలకు కూడా పూజా హెగ్దే బీస్ట్ ఆప్షన్ అయ్యింది. ఆమె ఉంటే అన్ని విధాలుగా సినిమాకు ప్లస్ అన్నట్టే. మరి ఈ ఏడాది వస్తున్న ఈ ఐదు సినిమాలతో పూజా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి. పూజా హెగ్దే మాత్రం ప్రస్తుతం కెరియర్ మీద ఫుల్ ఫోకస్ తో దూసుకెళ్లిపోతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: