హిట్ పడితే.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు..?

Satvika
హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా ఒక హిట్ పడితే వాళ్ళ రేంజ్ పూర్తిగా మారిందని తెగ ఫీల్ అవుతారు. మన హీరోలంత డిమాండ్ చేయట్లేదు కానీ వాళ్లకున్న రేంజ్ చూపిస్తున్నారు. సినిమా కు ముందు సినిమా హిట్ పడితే రెమ్యునరేషన్ ను పూర్తిగా పెంచుతున్నారు. ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని తేడాలు చెబుతున్నారు. కృతిశెట్టి రెమ్యునరేషన్ విషయం లో రీసెంట్ గా ఓపెనయ్యాడు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ. ఉప్పెన మాసివ్ హిట్ తో అడిగినంత ఇవ్వక
తప్పలేదన్నాడు.

నిజానికి ఉప్పెనతో ఇంట్రడ్యూస్ అయిన వెంటనే టపీటపీమని సినిమాలకు సైన్ చేసేసింది కృతి శెట్టి. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడం.. కృతి ఆ సినిమా లో హైలైట్ కావడం తో పారితోషకం పెంచేసింది. అందుకే బంగార్రాజు మూవీకి దాదాపు 2 కోట్లు అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అయితే మరింత రెమ్యునరేషన్ పెంచే ఆవకాశం ఉందని సినీ విష్లెషకులు అంటున్నారు. పుష్ప సినిమా తో రష్మిక.. ఇప్పుడు క్రష్మికగా మారింది. 5 భాషల్లో మూవీ రిలీజ్‌ కావడంతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది.

అంతేకాదు ప్రెజెంట్ బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. దీంతో పారితోషికాన్ని పెంచేసిందన్న వార్త ఫిల్మ్‌ దునియా లో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అలియా భట్ 9 కోట్లు తీసుకుందనే టాక్ ఉంది.. ఇంక హిందీ సినిమా లో ఏకంగా 20 కోట్లు తీసుకుందని తెలుస్తుంది.. తనే కీ రోల్ చేసే సినిమాల్లో ఒకలా.. హీరోతో కలిసి నటిస్తే మరోలా ఛార్జ్ చేస్తోంది అలియా. డిమాండ్ కి తగ్గట్టే అడుగుతున్నానని డైరెక్ట్ గానే చెప్పేస్తుందీ. ఇలా సినిమాలు హిట్ అయితే ఇలా పెంచితే ఇక డైరెక్టర్ లు కొత్త హీరోయిన్ వేటలో పడతారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: