దేవుడి దయ వల్ల అలా జరిగితే నాగార్జున గట్టెక్కిన్నట్లే..?

VUYYURU SUBHASH
కరోనా మహమ్మారి కారణంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో సంక్రాంతి రేస్ లోకి చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. ఇక ఈ సంక్రాంతి రేస్ లో ఉన్న కాస్తో కూస్తో పెద్ద సినిమా అంటే అది ..బంగార్రాజు అనే చెప్పాలి. మిగత రెండు సినిమాలల్లో యంగ్ హీరోలు కావడం..అందులోను హీరోలు ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాలు కావడంతో ఈ సంక్రాంతికి అందరి కళ్లు నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు మీదనే ఉన్నాయి.
ఇక ఇప్పటికే  రిలీజ్ అయిన్ ట్రైలర్ బట్టి ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గ భారీ విజయాని నమోదు చేస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టకుండా తనదైన స్టైల్లో బంగార్రాజుని తెరకెక్కించాడు  కళ్యాణ్. ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైం తనలోని డ్యాన్స్ ని కూడా అభిమానులకు పరిచయం చేయనుంది కన్నడ బ్యూటి కృతిశెట్టి. ఇక ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగానే చేసారు మేకర్స్. ముఖ్యంగా నాగార్జున,కృతి శెట్టి , నాగచైతన్య ముగ్గురు కూడా సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చారు. దీంతో సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఈ సినిమా హిట్ అయితే ఇక నాగచైతన్య కెరీర్ గురించి నాగ్ ఆలోచించనవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. నిజం చెప్పాలంటే అక్కినేని కుటుంబంలో నాగేశ్వరావు గారి తరువాత ఇప్పటి వరకు స్టార్ హీరోగా నిలబడి సినీ ఇండస్ట్రీలో తన ఫ్యామిలీ పరువును కాపాడుకుంటూ వస్తున్నాడు నాగార్జున. అక్కినేని కుటుంబ వారసులుగా చైతన్య,అఖిల్ సినిమాలోకి వచ్చిన నాగార్జున అంత పేరు మాత్రం సాధించలేకపోయారు. ఇక ఇప్పుడిప్పుడే ఇద్దరు కొడుకులు సక్సెస్ బాట పడుతున్నారు. ఒక్కవేళ ఇలాగే కొనసాగి  చైతన్య బంగార్రాజు సినిమా..అఖిల్ ఏజెంట్ సినిమాలు హిట్ అయితే నాగార్జున సేఫ్ జోన్ లోకి వెళ్లిన్నట్లే అంటున్నారు సినీ ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: