బాలయ్య సినిమాలో ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్..బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..?

VUYYURU SUBHASH
ఎన్నో భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 ఈ మధ్యనే ముగిసింది. ఫస్ట్ నుండి టైటిల్ విన్నర్ అవుతాడు అని అనుకున్న యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అందరి ఆశలను తలకిందులు చేస్తూ రన్నర్ పొజీషన్ తో సరిపెట్టుకున్నాడు. ఇక ఫస్ట్ నుండి హౌస్ లో యాక్టివ్ గా ఉంటూ సరదాగా నవ్విస్తూ..టాస్క్ అంటే చెలరేగిపోయే సన్నీ ni భారీ సంఖ్యలో ఓట్లు వేసి టైటిల్ విన్ అయ్యేలా చేసారు ఆయన అభిమానులు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక అందరు తమ లైఫ్ లో బిజీ అయిపోయారు. కొందరు సీరియల్స్ చేసుకుంటుంటే..కొందరు సినిమా అవకాశాలు అందుకుని ఆ సినిమా  షూటింగ్ లల్లో బిజీ గా ఉన్నారు. కొందరు యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు కూల్ గా ఉంటూ గొడవల జోలికి అస్సలు పోని మానస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పలు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యులు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా అందరి కంటెస్టెంట్లకీ మానస్ కు చాలా తేడా ఉంది. బిగ్ బాస్ హౌస్ లో నోరు తక్కువ వాడి బుర్ర ఎక్కువ వాడిన వారి జాబితాలో  మానస్ ఒక్కడే ఉంటాడు. అంత తెలివిగా గేం ఆడి టాప్ 4 స్దానాన్ని దక్కించుకున్నాడు మానస్.
అయితే తాజాగా ఈయనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అది ఏమిటంటే..టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య సినిమాలో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా నటిస్తున్నాడంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. డైనమిక్ డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో  రాబోతున్న బాలయ్య సినిమాలో మానస్ అవకాశం అందుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో  వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కవేళ్ల ఇదే కనుక నిజమైతే మానస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇదే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: