ఇక ఈ హీరోయిన్ లు పెళ్లి చేసుకోవాలేమో!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు యవ్వన దశలోనే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి ఆ తర్వాత వారు మంచి మంచి సినిమాలు చేసి బాగా డబ్బు సంపాదించి యుక్త వయసులో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలా 30 ఏళ్లు దాటిన తర్వాత సినిమాల్లో ఉండడానికి హీరోయిన్ లు ఎక్కువ ఆసక్తి చూపరు. పెళ్ళిళ్ళు చేసుకుని తమ వ్యక్తిగత జీవితం లోకి వెళ్ళిపోయి అక్కడ తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రస్తుతం 30 ఏళ్లు దాటిన కూడా పెళ్లి చేసుకోకుండా సినిమాలలో చేస్తున్న హీరోయిన్ లు ఉన్నారు. వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

30 ఏళ్లు వస్తున్నా కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ పోతుంది పూజా హెగ్డే. ఆమె సినిమా పరిశ్రమలోకి వచ్చి దాదాపుగా పదేళ్లు దాటుతున్న కూడా ఆమెకు సినిమా అవకాశాలు ఏ మాత్రం తగ్గటం లేదు. అందుకే కాబోలు ఆమె ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేస్తూనే ఉంది. మరి తొందరలోనే ఈ సినిమా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆమె ఇప్పటి నుంచి పెళ్లి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది సినీ విశ్లేషకుల మాట. ఇక అనుష్క కూడా పెళ్లి చేసుకుంటే చూడాలనేది వారి అభిమానుల కోరిక గా తెలుస్తుంది.

ఆమె సినిమా పరిశ్రమలో వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్న నేపథ్యంలో ఇక సినిమాలు కూడా పెద్దగా లేని నేపథ్యంలో ఈమె పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అందరూ సలహాలు ఇస్తున్నారు. ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొన్ని రోజులు ఉంది లక్ష్మీ రాయ్. ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది ఆమె. మొదట్లో మంచి మంచి సినిమా అవకాశాలు అందుకోగా ఇప్పుడు ఆమె చేతిలో పెద్ద సినిమా అవకాశాలు లేవు. అప్పుడప్పుడు వచ్చే ఐటమ్ సాంగ్ అవకాశాలు కూడా లేవు. దాంతో ఈమె పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయితే మంచిదని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు కొంతమంది ముదురు హీరోయిన్లు కూడా తమ వయసు మరిచిపోయే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అలా ఎదురు చూసి వారు తమ వయసును పోగొట్టుకుని వ్యక్తిగత ఆనందాన్ని కూడా కోల్పోతున్నారు. ఇది గమనించి వారు తమ వ్యక్తిగత జీవితంలో ఆయన సంతోషం గా ఉంటే మంచిదని కొంత మంది సలహాలు ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: