శ్రీకాంత్ ఆశలు అడియాశలేనా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో శ్రీకాంత్ కు ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. అందాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీకాంత్ హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసి అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ విధంగా శ్రీకాంత్ అందరి హీరోలకు బాగా దగ్గర అయ్యి వారి ప్రేమ ఆప్యాయతల తో పాటు అభిమానుల అభిమానాన్ని కూడా పొందాడు.

ఈ నేపథ్యంలోనే కొత్త హీరో ల రాకతో శ్రీకాంత్ కు అవకాశాలు తగ్గాయి. దానికి తోడు ఎప్పటినుంచో సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న కూడా ఆయనకు క్రేజ్ మాత్రం ఏమాత్రం పెరగలేదు. శ్రీకాంత్ ఉన్నాడు అంటే ఉన్నాడు అనే విధంగానే ఆయన సినిమాలు చేసేవాడు కానీ ఆయనకు స్టార్ డం అనేది ఓ పట్టాన రాలేదు అనే చెప్పాలి. తాజాగా ఆయన మళ్లీ విలన్ గా చేయడం మొదలుపెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ సినిమాలో విలన్ పాత్ర చేయగా ఆ తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు రావడం ఖాయం అని అనుకున్నారు కానీ ఆయన ఊహించిన రేంజ్ లో సినిమా అవకాశాలు అయితే శ్రీకాంత్ కు రావడం లేదు.

ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన అఖండ పాత్రకు రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే రావడంతో శ్రీకాంత్ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. దానికి తోడు ఆ పాత్ర శ్రీకాంత్ కు పెద్దగా సూట్ కాకపోవడం ఆయనకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణాలు. నిజానికి ఈ సినిమాలోని ఆ పాత్ర హిట్ అవ్వలేదని చెప్పాలి. దాంతో శ్రీకాంత్ కెరియర్ నిలబడాలంటే ఇప్పుడు మరొక పాత్ర మంచి పాత్ర ఆయనకు పడాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేసిన శ్రీకాంత్ ఆ పనుల్లో ఇప్పుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏ దర్శకుడైనా శ్రీకాంత్ కోసం అద్భుతమైన పాత్ర రాసి ఆయనకు బాగా ఎలివేషన్ ఇచ్చే పాత్ర రాసి ఆయన నిలబడేలా చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: