మన సీనియర్ హీరోలు అలా చేయరా!!

P.Nishanth Kumar
ఇతర సినిమా పరిశ్రమలోని సీనియర్ హీరోలతో పోలిస్తే మన సీనియర్ హీరోలలో ఇంకా కుర్రతనం ఉందనే చెప్పాలి. ఎందుకంటే సోలో హీరోగా చేయడానికి మన సీనియర్ హీరోలు ఇంకా మొగ్గు చూపుతూ ఉండడం చూస్తుంటే వారికి కుర్రతనం పోలేదనే చెప్పాలి. మన సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ సీనియర్ హీరోలు గా కొనసాగుతున్నారు. ఇంకా హీరో సెంట్రిక్ సినిమాలు చేసుకుంటూ తమ అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఇతర భాషలలోని సీనియర్ హీరోలలా మన హీరోలు చేయకపోవడం సినిమా ప్రేమికులను ఎంతగానో నిరాశపరుస్తుంది.

మరి ఇతర సీనియర్ హీరోలు చేసేది మన సీనియర్ హీరోలు చేయనిది ఏమిటి అంటే సోలో హీరోగా మాత్రమే కాకుండా కొన్ని మంచి మంచి సినిమాలలో ముఖ్యమైన పాత్రలు చేయడం ద్వారా సదరు హీరో సినిమాకి సినిమా పరిశ్రమకి కూడా మంచి పేరు వస్తుంది. తద్వారా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. వారికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మన హీరోలు ఆలోచన చేయకపోవడం వారు ఇంకా సోలో హీరోలుగా కొనసాగుతూ హీరో సెంట్రిక్ సినిమాల్లో నటించడం పట్ల సినిమా ప్రేమికులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు.

ఇప్పుడున్న మన నలుగురు హీరోలలో వెంకటేష్ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆయన తన సినిమాలలో వైవిధ్యత ఉండే విధంగా చూసుకుంటూ ఉంటారు. ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసినా కూడా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు వెంకటేష్. ఆ విధంగా నాగార్జున చేయడానికి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తూ ఉండగా మిగిలిన ఇద్దరు హీరోలు బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పుడూ కూడా ఈ విధమైన ప్రయోగం చేయలేదని చెప్పాలి. వారికి భారీ ఇమేజ్ ఉన్నందున ఈ విధమైన ప్రయత్నాలు చేయటం లేదని అనుకోవచ్చు. మరి వీరు ఎప్పుడు ప్రయోగాలు చేస్తారు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: