యాంకర్ సుమ కొడుకు జాక్ పాటు కొట్టాడోచ్... ?

VAMSI
బుల్లి తెరను శాసించిన సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాలుగు పదులు వయసు దాటుతున్నా ఇప్పటికీ అంతే చలాకీగా తన వాక్చాతుర్యం తో అందరినీ అలరిస్తున్నారు. నిజానికి అవకాశాలు ఈమెని వెతుక్కుంటూ వస్తున్నాయనే చెప్పాలి. ఆమె ఏ షో చేసినా టాప్ రేటింగ్ రావాల్సిందే.. షో నిర్వాహకులకు ఆమెపై అంత నమ్మకం. అయితే ఎప్పుడూ ప్రోగ్రామ్స్ తో మూవీ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉండే సుమ తన కుటుంబాన్ని చూసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు.

ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ గురించి కేర్ తీసుకుంటారు. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సుమ అటు కెరీర్ ని ఇటు ఫ్యామిలీ ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్నారు.
1999 ఫిబ్రవరిలో రాజీవ్ కనకాల, సుమ ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు రోషన్, కూతురు మనస్విని. అయితే సుమ తనయుడు రోషన్ కనకాల సినీ రంగ ప్రవేశం చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా కుమార్తె మనస్వినికి కూడా సినిమాలంటే చాలా ఆసక్తి అని ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.  
 
అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం రోషన్ కనకాల ఇంతక ముందు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా చేసిన "నిర్మల కాన్వెంట్" చిత్రం లో కీలక పాత్ర పోషించిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. కాగా ఇప్పుడు ఒక యంగ్ హీరో సినిమాలో ఒక పాత్రకు రోషన్ ను ఎంచుకున్నారట డైరెక్టర్. అందుకోసం తన మేక్ ఓవర్ లో మార్పులు చేసుకుంటున్నాడట. ఇందు లో హీరోకు ప్రత్యర్థి పాత్ర అని తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: