పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. భీమ్లా నాయక్ వాయిదా అంటూ..!!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రాజకీయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అన్ని రీమేక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ.. రీమేక్ సినిమాలు చేస్తూ ఉండటం గమనార్హం. బాలీవుడ్ సూపర్ హిట్ సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది కాబట్టి ఆయన వరుసగా రీమేక్ సినిమాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ గా  భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే..
అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుకున్న అభిమానులకు జనవరి 12 వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో దగ్గుబాటి రానా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలసి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా పర్యవేక్షణ చేస్తుండటంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు కూడా రికార్డుల మోత మోగించాయి..
ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. మధ్యలో వాయిదా పడుతుందని పుకార్లు వచ్చినా .. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెక్ పెడుతూ ఎలాంటి పరిస్థితిలోనైనా సరే జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇక అభిమానులు కూడా ఆ డేట్ కి ఫిక్స్ అయ్యారు... కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకింగ్ వీడియోలు అదరగొడుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారట. ఇకపోతే ఈ వార్త పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: