గురువుకు సాధ్యం కానిది శిష్యుడికెలా సాధ్యం!!
చలో సినిమా తో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమ కు పరిచయమై ఆ తర్వాత ఆయన భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఆయన తన రెండో చిత్రాన్ని యంగ్ హీరో నితిన్ తో చేయగా భీష్మ సినిమా కూడా ప్రేక్షకుల ను విపరీతంగా ఆకట్టుకుంది. వరుసగా రెండో విజయం వెంకీనీ వరించగా వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద హీరోల చూపు ఈ దర్శకుడు పై పడింది. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్ లో ఆయన ఓ సినిమా చేసేందుకు డోర్స్ తెలుసుకున్నట్లు అయ్యింది.
మొదటగా ఈ దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేయగా అది వర్కౌట్ కాలేదు. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్రాన్ని చేశా డు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడానికి పెద్ద దర్శకులు సైతం చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ వారెవరికీ దక్కని అదృష్టం ఈ యంగ్ డైరెక్టర్ కి దక్కడం తో అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వెంకీ కి గురువు గా పరిగణిస్తున్న త్రివిక్రమ్ కు అవకాశం ఇప్పటివరకు దక్కలేదు దాంతో గురువు దక్కని ఈ అవకాశం శిష్యుడికి దక్కడంతో ఒకసారి అందరూ ఆశ్చర్యపోతున్నారు.