"ఉ అంటావా" బన్నీ..సమంత మాస్ మామూలుగా లేదే..!!

VUYYURU SUBHASH
స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్, కష్ట పడే సత్తా లేనప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఎందుకు పనికి రాదు. చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్..ఆ తరువాత తనలోని టాలెంట్ ను బయట ప్రపంచానికి చూయిస్తూ.. స్టార్ హీరో అవ్వాలి అన్న తన కలను నిజం చేసుకున్నారు. నటన పరంగా ఈయన ఎంత బాగా నటించిన ప్రతి సినిమాలో ఈయన డ్యాన్స్ నే హైలెట్ గా నిలిస్తుంది. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ అల్లు వారి అబ్బాయి..మరి కొద్ది రోజుల్లో సినీ చరిత్ర రికార్డులను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్నారు.
సుకుమార్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడాని బాక్స్ ఆఫిస్ వద్ద రచ్చ చేయడానికి పుష్ప సినిమాతో అల్లు అర్జున్  ఈ నెల 17న మన ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన అన్నీ పాటలు, హీరో హీరోయిన్ల లుక్స్, అనసూయ-సునీల్ పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన ఈ సినిమాలో డిగ్లామరస్ రోల్ లో కనిపించనుండడం విశేషం. ఇక ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సమంత. తన కెర్రిర్ లో ఇప్పటి వరకు చేయని విధంగా మొదటిసారి ఐటెం సాంగ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసింది సమంత.
రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ పాట ఫుల్ మాస్ బీట్ తో అద్దిరిపోయేటట్లు ఉందని చిత్ర బృందం అంటున్నారు. ఇక ఈ పాటకు సంబంధించి రిలీజ్ అయిన లుక్స్ లో సమంత టూ హాట్ గా ఉంది. ఈ పాటలో సమంత లంగా, జాకెట్ ధరించిన్నట్లు కనిపిస్తూ ఉండే పోస్టర్ ను రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం రాక్ స్టార్  దేవిశ్రీ ప్రసాద్ దూములేపే మాస్ ట్యూన్ ఇచ్చిన‌ట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మ్యూజిక్‌కి బ‌న్నీ స‌మంత ఇద్దరు పోటా పోటీగా ఇర‌గ‌దీసే స్టెప్పులేసారని స‌మాచారం. ఇక ఈ పాట  ‘ఉ అంటావా.. ఊ అంటావా’ బన్నీ అంటూ  సాగునుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి ఈ పాట అలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: