బాలయ్యకు అన్నగా మోహన్ బాబు...?

Sahithya
తెలుగు సినిమాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కొన్ని కీలక పరిణామాలు కాస్త ఆసక్తిని రేపాయి అనే మాట వాస్తవం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు కూడా కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టంగా చెప్పాలి. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో కాస్త ఆసక్తికర చర్చ జరగడమే కాకుండా కొంత మంది స్టార్ హీరోలు కు సంబంధించి కొన్ని మల్టీస్టారర్ సినిమాలు కూడా ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉందని అంచనాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చాలా సానుకూలంగా ఉన్నారని సీనియర్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి రెడీ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తన సినిమాలో మంచు  మోహన్ బాబును తీసుకునే అవకాశం ఉందని ఈ మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించి ఆయన చాలా సానుకూలంగా ఉన్నారని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన సినిమాలో మోహన్ బాబు బాలకృష్ణ కు అన్న గా నటించే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోయినా గోపీచంద్ మలినేని మోహన్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ పాత్రలో రెడీ చేశారని ఈ సినిమాలో మోహన్ బాబు ఎమ్మెల్యే గా కనపడే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక గ్రామంలో రైతులా బాలకృష్ణ కనబడే అవకాశం ఉందని దీనికి సంబంధించి బాలకృష్ణ కూడా సానుకూలత వ్యక్తం చేశారని అయితే ఈ సినిమా కధకు సంబంధించి కొన్ని మార్పులు ఉండటంతో నిర్మాత కొన్ని మార్పులు సూచించారని అలాగే మరో హీరో కూడా ఈ సినిమాలో కాస్త గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నిర్మాత వ్యక్తం చేసినట్లుగా టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: