సమంతకు 2022 అయినా కలిసొస్తుందా?

VAMSI
సినిమా రంగంలో ఎక్కువగా సెంటిమెంట్స్ ను బాగా నమ్ముతుంటారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ నష్టాల ఊబిలో చిక్కుకుందని తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి నెల తర్వాత కాస్త కరోనా గ్యాప్ ఇచ్చింది. దీనితో కొన్ని సినిమాలు థియేటర్ లో విడుదల అవుతూ వచ్చాయి. కొన్ని సినిమాలు మాత్రం ఒ టి టి లో విడుదల అయ్యాయి. 2021 ఎన్నో చేదు జ్ఞాపకాలను తెలుగు సినిమా ప్రేక్షకులకు మిగిల్చింది. అందులో ఒకటి టాలీవుడ్ జంట నాగచైతన్య మరియు సమంతల జంట విడిపోవడం. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ కొన్ని అనుకోని కారణాల వలన ఈ అక్టోబర్ నెలలో విడాకులు తీసుకోనున్నామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దీనితో వీరిద్దరినీ అభిమానించే వారంతా ఎంతో బాధ పడ్డారు. అయితే దీని వలన మానసికంగా ఇద్దరిలో ఎంత బాధ ఉందో తెలియకపోయినా, నెటిజన్ల మూలంగా ఎన్నో రెట్లు సమంత ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రోజు రోజుకీ సమంత గురించి ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. అయితే దీని గురించి సమంత ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆవేదనను వెళ్లబుచ్చారు. ఇందులో ముఖ్యంగా ఆమె చెప్పిన విషయాలు కళ్ళు చెమర్చేలా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి సంపాదిచుకున్న పేరు ప్రతిష్టలు ఒక్క రెండు నెలలుగా నీరు గారిపోతోందని తన బాధను తెలిపింది సమంత.
నాకు 2021 పెద్దగా కలిసి రాలేదని... మొదటగా కరోనా కారణంగా సినిమా వాయిదా మరియు ఇలా చైతూతో విడిపోవడం వంటి కారణాలతోనే గడిచి పోయింది అని విచారాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు తనకు నచ్చిన విధంగానే విడిపోయింది. కాబట్టి 2022 సంవత్సరం అయినా కలిసి వస్తుందా లేదా అని సమంత ఫ్యాన్స్ ఆలోచిస్తూ ఉన్నారు. అనుకున్నట్లుగానే సమంతకు 2022 బాగా కలిసి రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: