మెగా హీరోలకు ఇలా ఎందుకు అవుతుంది!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అరడజనుకు పైగా నే మెగా వారసులు హీరోలుగా కొనసాగుతున్నారు. సక్సెస్ లు  విజయాల సంగతి పక్కన పెడితే మెగా హీరోలు చాలామంది కూడా ఎంతోమంది కొత్తవారితో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కొన్ని వందల మందికి పని కల్పిస్తూ ఉంటున్నారు. అయితే ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్న కూడా వారికి ప్రతిఫలం సరిగా అందకపోవడం వారిని ఎంతగానో కలవరపరుస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమను కరోనా వచ్చి ఇలాంటి ఇబ్బందులను గురి చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కరోనా కూడా అందరి హీరోల సినిమాలు విడుదలయ్యే వరకు ఎటువంటి ప్రభావాన్ని చూపించదు కానీ ఎప్పుడైతే మెగా హీరోల సినిమాలు విడుదల అవుతాయో అప్పుడే కరోనా ప్రభావం ఎక్కువగా చూపించగా ఆ సినిమాలను విడుదల చేయకుండా చూస్తుంది. ఇప్పటి దాకా ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా ఇప్పుడు   మెగా హీరోల సినిమాలు వచ్చే ముందే వారికి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ  ప్రభావం నుంచి వారు ఎలా తప్పుకుంటారు అనేది చూడాలి. వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం డిసెంబర్ లో విడుదల అనుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప చిత్రాన్ని డిసెంబర్ లోనే విడుదల చేయనున్నాడు.

జనవరిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత చిరంజీవి ఆచార్య సినిమాతో రాబోతున్నాడు. మరో వైపు రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్  సినిమాతో జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విధంగా మెగా హీరోలు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయంలోనే  ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలకు ఈ సారి ఈ మహమ్మారి ఎలాంటి ఎఫెక్ట్ ను కలగజేస్తుంది అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు సినిమా విశ్లేషకులు. మరి మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాలు ఏ విధంగా బతికి బట్ట కట్ట కలుగుతాయి అనేది చూడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: