బేబీ మరో ఆర్య అవుతుంది.. నమ్మకం తో ఆనంద్ దేవరకొండ!!

P.Nishanth Kumar
ఇటీవలే పుష్పక విమానం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై నటుడిగా తనను తాను నిరూపించుకున్న ఆనంద్ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మూడవ సినిమాగా వచ్చిన పుష్పక విమానం కూడా మంచి సక్సెస్ కావడంతో ఆయనకు టాలీవుడ్ లో నిలదొక్కుకునే ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. 

ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవి గుహన్ దర్శకత్వంలో హైవే అనే సినిమా చేస్తున్న ఆనంద్ ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాని పూర్తి చేశారో లేదో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో చేయబోయే బేబీ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ సిద్ధం కాబోతోంది.  ఈ చిత్రం ఆనంద్ దేవరకొండకు మంచి విజయాన్ని చేకూర్చిన నమ్మకంతో ఉన్నాడు.

అల్లు అర్జున్ కెరీర్లో చేసిన రెండో సినిమా ఆర్య ఆయనకు ఎలాంటి బూస్టప్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ సినిమా కూడా తనకు మంచి బూస్ట్ ఇస్తుందన్న నమ్మకం వ్యక్తం పరుస్తున్నాడు ఆనంద్. ప్రేమ కథ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వైవిధ్యభరితమైన కథనంతో వుండగా ఈ చిత్రంలోని కొన్ని పాయింట్లకు ఫిదా అయిన తర్వాతనే ఈ చిత్ర కథ ఒప్పుకున్నట్లు ఆనంద్ తెలిపారు. అలాగే లుక్ విషయంలో కూడా ఆనంద్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. లవర్ బాయ్ గా ఆయన తొలిసారి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాలో ఆనంద్ ప్రేక్షకులను అలరించే విధంగా కనిపించాలని నటించాలని ఎంతో ఆసక్తితో ఈ సినిమాలో నటిస్తున్నాడు. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండకు ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని చేకూరుస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: