'అఖండ' మాస్ జాతర.. నాలుగు రోజుల్లోనే తెలంగాణాలో లాభాలు..!!

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1550 థియేటర్లకు పైగా విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అని అందుకని బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై 70 కోట్ల బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. బాలయ్య నటించిన ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు అవుతున్న కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.

 ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 37.56 కోట్ల షేర్‌ను  సాధించింది. అయితే ప్రస్తుతం అఖండ సినిమా తెలంగాణలో బ్రేకీవెన్ సాధించేసి, డిస్ట్రిబ్యూటర్లకు  ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది. తాజాగా దిల్ రాజు రూ. 10.5 కోట్లకు ఈ సినిమా పంపిణీ హక్కుల్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ సినిమా విడుదలైన నాలుగు రోజుల వ్యవధిలోనే....12.11 కోట్ల షేర్‌ను రాబట్టింది. బాలయ్య నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు 4.39 కోట్ల షేర్‌తో అత్యధిక ఓపెనింగ్స్  సాధించి రికార్డు సంపాదించుకుంది. ఇకపోతే రెండో రోజు రూ. 2.26 కోట్లు, మూడో రోజు రూ. 2.51 కోట్లు, నాలుగో రోజు 2.95 కోట్లను సంపాదించుకున్న ట్లుగా తెలుస్తోంది.

అయితే రికార్డు స్థాయిలో నమోదైన ఈ కలెక్షన్లను చూసి దిల్ రాజు సైతం విస్మయానికి గురయినట్లు తెలుస్తోంది. కరోనా తరువాత ఇదే పెద్ద సినిమా కావడంతో భారీ విజయాన్ని అందుకుంది బాలకృష్ణ సినిమా. అయితే అఖండ సినిమా షూటింగ్ సమయంలో యస్‌.యస్‌. రాజమౌళి సైతం ఈ సినిమా కలెక్షన్ల  విషయాన్ని ప్రశంసించారు. ఆయన ప్రశంసించిన టు గాని ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు ఇండస్ట్రీకి ఊపిరిపోసాయనే  చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ తొలివారం పూర్తి చేసుకొని బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్ లకు మరింత ఆనందాన్ని ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: