జూనియర్ బాలయ్యల ను కలపబోతున్న అఖండ సక్సస్ మీట్ !

Seetha Sailaja
రివ్యూలతో సంబంధం లేకుండా ‘అఖండ’ కలక్షన్స్ పరంగా అఖండంగా దూసుకు పోతోంది. ఈ కలక్షన్స్ ట్రెండ్ నేడు సోమవారం కూడ కొనసాగితే ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అంటున్నారు. ఇప్పుడు ఈ జోష్ ను మరింత కొనసాగించడానికి ఈ మూవీ సక్సస్ మీట్ ను హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రభుత్వ అనుమతులు లభిస్తే ఈ సక్సస్ మీట్ ను భాగ్యనగరంలోని ఒక ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహించి నందమూరి అభిమానులకు జోష్ ను కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అది లేకుంటే శిల్పకళారామంలో ఈ మీట్ జరుగుతుంది అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మీట్ కు జూనియర్ ని అదేవిధంగా మహేష్ ని అతిధులుగా పిలవాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

అంతేకాదు మహేష్ నుంచి సానుకూల స్పందన కూడ వచ్చింది అని అంటున్నారు. ఇక జూనియర్ విషయానికి వస్తే అతడు ఈ సక్సస్ మీట్ కు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించే సాహసం చేయలేదని ఒకవేళ అలాంటి సాహసం చేస్తే దాని ప్రభావం బాలయ్య అభిమానుల పై పడి జనవరిలో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ పై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జూనియర్ వచ్చి తీరుతాడు అన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బాలయ్య జూనియర్ ల మధ్య తిరిగి సయోద్యను కుదిర్చే ఈవెంట్ గా ‘అఖండ’ సక్సస్ మీట్ మారబోతోంది అనుకోవాలి.

ఎప్పటి నుంచో జూనియర్ బాలయ్యతో కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు జూనియర్ బాలయ్యల మధ్య కుదిరే సయోధ్య వారి ఇద్దరితో తీయబోయే మల్టీ స్టారర్ కు సహకరించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య అల్లు అరవింద్ మహేష్ జూనియర్ లతో కలిపి ఒక మల్టీ స్టారర్ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: