నెటిజన్లు అడిగిన ఆ ప్రశ్నకు ఉపాసన సమాధానమిస్తుందా...?

murali krishna
మెగా కోడలు మరియు కామినేని ఇంటి ఆడపడుచు 'ఉపాసన' మంచి వ్యాపారవేత్త అని ఆమె వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుందని అందరికి తెలుసు.

అంత బిజీలో కూడా ఆమె తన సెంటిమెంట్స్ ను మాత్రం వదలడం లేదట.. ఉపాసనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందట.తనకు సంబంధించిన ఏ శుభకార్యం జరిపినా ట్రాన్స్ జెండర్ లను ఇంటికి పిలిచి మరి వారికీ తనదైన ఆదిత్యం ఇస్తోందని తెలుస్తుంది.

ప్రతి ఏడాది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని తన ఇంటికి పిలిపించుకున్నట్లే ఈ ఏడాది కూడా ఉపాసన ట్రాన్స్ జెండర్ లను తన ఇంటికి పిలిపించుకుందట. పైగా వారికి చీర మరియు సారె పెట్టి వారి ఆశీర్వాదం కూడా తీసుకుందట.పైగా ఆ ఫోటోలను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందని తెలుస్తుంది.నెటిజన్లు ఈ ఫోటోలను చూసి తెగ కామెంట్స్ పెడుతున్నారట  

ఉపాసనకి ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అంటే ఎంతో ప్రేమ అని ఒకరు అలాగే ట్రాన్స్ జెండర్స్ పై ఎందుకు ఉపాసన గారికి అంత ఇంట్రెస్ట్ అని మరొకరు, పూజలు జరిగితే స్వామీజీలు ఆశీర్వాదం తీసుకుంటారు కానీ ఉపాసన గారు మాత్రం ట్రాన్స్ జెండర్స్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటార అదే ఆమె ప్రత్యేకత అంటూ ఇంకొకరు ఇలా చాలా కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.


ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఉపాసన ఎప్పుడు తల్లి కాబోతున్నారు అంటూ నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ అడుగుతున్న ప్రశ్న మాత్రం బాగా వైరల్ అవుతుందని మరి ఈ ప్రశ్నకు ఇప్పటికైనా ఉపాసన నుంచి సరైన సమాధానం వస్తోందా లేదా చూడాలి.

ప్రస్తుతం ఉపాసన అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తూ సామాన్యులకు హెల్త్ టిప్స్ చెబుతూ ముందుకెళ్తుందట. ఉపాసన హెల్త్ వరకే పరిమితం అవ్వలేదట మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిస్తూ కోడలి పాత్రను కూడా సమర్థవంతంగా పోషిస్తోందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: