హరిహర వీరమల్లు సినిమా నుండి నిధి అగర్వాల్ తప్పకుందా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమా లకు కొంత కాలం పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాత గా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది, ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమా ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ను చక చక పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమా ను సంక్రాంతి కానుక గా జనవరి 12 వ తేదీ న విడుదల చేయబో తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన చేసింది.

అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో పాటు హరిహర వీరమల్లు సినిమాను కూడా దాదాపు ఒకే సారి ప్రారంభించాడు, కాక పోతే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత దర్శకుడు క్రిష్ కొండపొలం సినిమా ను ప్రారంభించాడు. కొండాపొలం సినిమాను దర్శకుడు ప్రారంభించడం తో హరి హర వీరమల్లు సినిమా కొంత కాలం వాయిదా పడింది, అయితే మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గెస్ నటిస్తున్న నిధి అగర్వాల్ ను ఈ సినిమా నుండి చిత్ర బృందం తప్పించినట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త అవాస్తవమని తెలుస్తోంది, ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: