శ్రీకాంత్ అఖండకు అంత పారితోషికం తీసుకున్నాడా?

Purushottham Vinay
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అఖండ సినిమా హవా ఫుల్ గా కొనసాగుతోంది. ఫ్లాప్ లో ఉన్న బాలయ్యకు, బోయపాటి శ్రీనుకు అఖండ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ భారీ విజయం దక్కింది.అలాగే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని శ్రీకాంత్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.సినిమాలో మెయిన్ విలన్ కాకపోయినా కాని వరదరాజులు అనే విలన్ పాత్రకు శ్రీకాంత్ తన తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే ఇందులో శ్రీకాంత్ మెయిన్ విలన్ కనుక అయ్యి ఉంటే ఈ సినిమా సక్సెస్ శ్రీకాంత్ కు చాలా ప్లస్ అయ్యి ఉండేది.అఖండ సినిమా కోసం శ్రీకాంత్ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లోనే నటించినా శ్రీకాంత్ మాత్రం ఈ ఊహించని స్థాయిలో పారితోషికం తీసుకోవడం అనేది మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ఈ సినిమా సక్సెస్ శ్రీకాంత్ కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో అనేది ఇంకా చూడాల్సి ఉంది.

ఇక బోయపాటి శ్రీను తన సినిమాలలో మంచి పాత్రలు ఇస్తూ శ్రీకాంత్ కెరీర్ కు బాగా హెల్ప్ అవుతున్నారు. జగపతిబాబులా శ్రీకాంత్ విలన్ గా బిజీ అవుతారని అభిమానులు భావించగా వారికి మాత్రం నిరాశ ఎదురవుతోంది.అఖండ సినిమా తర్వాత శ్రీకాంత్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.ఇక ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాలు కూడా పెద్ద సక్సెస్ సాధించడం లేదు. అయినా కాని శ్రీకాంత్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని అఖండ సినిమాకు నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది మాత్రం శ్రీకాంత్ కు అఖండ సినిమా రోల్ విషయంలో బోయపాటి శ్రీను అన్యాయం చేశారని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ప్రేక్షకులు శ్రీకాంతే మెయిన్ విలన్ అని అనుకున్నారు. కాని బోయపాటి శ్రీకాంత్ ని కేవలం ఓ ఊరి గుండా గానే ఇందులో సరిపెట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: