నా జీవితంలో నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఇదే అంటున్న సమంత..!

Divya
సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన కొన్ని విషయాలను, తన పర్సనల్ విషయాలను కూడా.. పంచుకుంటూ ఉంటుంది సమంత. సమంత ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ.. తన మనసుకు నచ్చిన పదాలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈమె. చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎక్కువగా కొన్ని సామెతలను పోస్ట్ చేయడం జరుగుతుంది.. అందులో మా అమ్మ చెప్పిందంటూ అనే హ్యాష్ ట్యాగ్ తో కొన్ని సందేశాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఎక్కువగా వివాహం, ప్రేమ, లైఫ్ అనే అంశం పైన ఈమె కొటేషన్లను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమె ఎటువంటి పోస్టులు పెట్టినప్పటికీ.. అది సమంత , నాగచైతన్య బంధానికి సంబంధించిన విధంగా కలుపుతుంటారు నెటిజెన్స్. అయితే ఇప్పుడు తాజాగా మరొక సూక్తి తో వచ్చినది. నా జీవితంలో నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఏంటంటే.. తను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలియజేసింది.
అయితే ఇలాంటి విషయాలు బాగానే ఉన్నప్పటికీ.. మరి కొన్ని విషయాలు అలా ఉండవు.. మీరు ఎంత పోరాడినప్పటికీ, గట్టిగా పట్టుకునప్పటికీ.. కొన్నింటిని వదిలేయడం తప్ప వేరొక దారి లేదని తెలిపింది సమంత. అంతేకాకుండా అంగీకారం అనేది ఒక చిన్న సైలెంట్ గది లాంటిది.. అని కొటేషన్ తో షేర్ చేసింది సమంత.
తనకి తన జీవితం నేర్పిన పాఠం ఏమిటంటే.. జీవితంలో ఎంత పోరాడినా కానీ ఓడిపోతూనే ఉంటామంటూ కొన్ని వాక్యాలను పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరిలోనూ రకరకాలుగా ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని తెలియజేసింది. అయితే ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది. ఇప్పుడు సమంత కెరియర్ మళ్లీ ఫుల్ బిజీగా మారిపోతోంది. ఇక ఇప్పటికే తనకు సంబంధించిన కొన్ని సినిమాలలో షూటింగ్ పూర్తి చేసుకున్నది. సమంతా కెరియర్ లోనే మొదటిసారిగా ఒక ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడం గమనార్హం. ఇక మరొకటి ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ని సొంతం చేసుకుంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: