పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ సినిమా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయవంతమైన సినిమాలుగా నిలవగా, మరికొన్ని మాత్రం అంత విజయవంతం సాధించలేకపోయాయి. కానీ రాజకీయ నేపథ్యం లో సినిమాలు తీయడం కాస్త రిస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల పై దర్శకులు చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  అయితే  రాజకీయ నేపథ్యం తో వచ్చిన తెలుగు సినిమాలలో కెమెరామెన్ గంగతో రాంబాబు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా, తమన్నా హీరోయిన్ గా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించాడు.

 ఈ సినిమా ఒక టీవీ చానల్ లో పని చేసే ఆ వ్యక్తి కి, మరియు ఒక పొలిటికల్ లీడర్ కు మధ్య జరిగే కథ. టీవీ ఛానల్ లో పనిచేసే హీరో వల్ల పొలిటికల్ లీడర్  ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, అనేది ఈ సినిమా కథ. ఎంతో భారీ ఖర్చు తో, భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా 18 అక్టోబర్ 2012 న విడుదలైంది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించడం, తమన్నా హీరోయిన్ గా నటించడం, అలాగే ఈ సినిమా కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం తో ఈ సినిమా విడుదలకు ముందు జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాకపోతే విడుదల తర్వాత మాత్రం ఈ సినిమా ఆశించిన రీతి లో విజయం సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ రేంజ్ కు ఈ సినిమా కథ సెట్ కాకపోవడం వల్లో, మరే ఇతర కారణాల వల్లో కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: