సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్ అప్పుడే ... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ అలానే పలు పోస్టర్లు సినిమా పై అందరిలో విపరీతంగా అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. తొలిసారిగా మహేష్ తో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న సర్కారు వారి పాట లో సూపర్ స్టార్ తో ఉత్తమ జాతీయ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా ని మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ప్రముఖ నటుడు సముద్ర ఖని ఇందులో విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ మొన్నటి దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే ముందుగా జనవరి కి సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్న యూనిట్ కొన్ని కారణాల వలన దానిని ఏప్రిల్ 1కి వాయిదా వేయడంతో సాంగ్స్ విడుదల ను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా యూనిట్ రిలీజ్ చేయనుందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా సర్కారు వారి పాట సాంగ్స్ ని, ఆపైన టీజర్స్, ట్రైలర్ రిలీజ్ చేసేలా అప్పుడే యూనిట్ పక్కాగా ప్రణాళికలు ఆరంబించిందని సమాచారం. మరోవైపు ఇటీవల వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమాతో కూడా మరొక బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన సర్కారు వారి పాట సినిమా రాబోయే సమ్మర్ లో రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: