రాజమౌళి గురించి ఆసక్తికరమైన కామెంట్ చేసిన రామ్ చరణ్..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమా లో  రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర లో కనిపించనుండగా,  ఎన్టీఆర్ కొమురంభీం పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరో లు ఈ సినిమా లో చేయబోయే పాత్రలకు సంబంధించిన ప్రోమో లను చిత్ర బృందం  విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, ఎంతో ఖర్చు తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్, సముద్ర కని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్న ఆర్ఆర్ఆర్  సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

 ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది, ఇప్పటికే దోస్తి అనే ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసిన ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే నాటు నాటు అనే సాంగ్ ను విడుదల చేసింది, అలాగే జనని అనే పాటను కూడా విడుదల చేసి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజా గా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు, ఆ తర్వాత ట్రైలర్ విడుదల తేదీ ని వాయి దా వేశారు. అయితే తాజా గా రామ్ చరణ్, రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి సినిమా లో నటించడం చాలా అదృష్టం గా భావిస్తున్నట్లు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: