బాలయ్యకు అచ్చొచ్చిన సెంటిమెంట్...?

Satya
బాలయ్య నాట్ ఔట్ అంటున్న సీనియర్ మోస్ట్ హీరో. బాలయ్య మరో మూడేళ్ళు గడిస్తే అర్ధ శతాబ్ది నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటారు. అవును ఆయన 1974 నుంచి అలుపే లేకుండా నటిస్తున్నారు. తనదైన మార్క్ ని చూపిస్తూనే ఉన్నారు.
బాలయ్యకు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన జాతకాలను నమ్ముతారు. ఆయన తానే చెప్పుకున్నట్లుగా డైరెక్టర్స్ హీరో. ఆయనకు తొలి గురువు, అన్నీ కూడా తండ్రి ఎన్టీయారే. ఆయన డైరెక్షన్ లో బాలయ్య పదకొండు సినిమాలు చేశారు. ఇక బాలయ్యకు ఒక డైరెక్టర్ కి మ్యాచ్ అయింది అంటే వారిద్దరి కాంబో రీసౌండ్ చేయడం ఖాయం.
అలా కోడి రామక్రిష్ణతో మొదలుపెడితే ఈ రోజున బోయపాటి శ్రీను దాకా బాలయ్య బాక్సాఫీస్ మోత మోగించేశారు. కోడి రామక్రిష్ణతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్యకు ఉన్నాయి. ఆ తరువాత కోదండరామిరెడ్డి. ఆయనా బాలయ్య కలిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. వారిద్దరికీ ఎన్నో హిట్లూ, సూపర్ హిట్లూ ఉన్నాయి.
ఇక బీ గోపాల్. ఈయన బాలయ్య తో అయిదు సినిమాలు తీస్తే అందులో నాలుగు సూపర్ హిట్లు, రెండు ఇండస్ట్రీ హిట్లు. ఇపుడు అదే వరసలో బోయపాటి శ్రీను బాలయ్యకు సెట్ అయ్యారు. ఈ ఇద్దరూ కలసి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ తో కలిపి హ్యాట్రిక్ కొట్టారు. దాంతో డబుల్ హ్యాట్రిక్ కి కూడా రెడీ అవుతున్నారు. ఈ మధ్యలో బాలయ్య తో జయంత్ సి పరాంజీ, రవిరాజా పినిశెట్టి, క్రిష్ లాంటి వారు కూడా ఒక్కో హిట్టూ ఇచ్చారు.
అలా మరి కొందరు డైరెక్టర్లు కూడా బాలయ్యతో మూవీస్ తీసి హిట్లు, ఎవరేజి మూవీస్ ఇచ్చారు. కానీ సాలిడ్ గా ఫ్యాన్స్ దాహం తీర్చే మూవీస్ ని ఇచ్చిన డైరెక్టర్లు అంటే కోడి రామక్రిష్ణ, కోదండరామిరెడ్డి, బీ గోపాల్, బోయపాటి అనే చెప్పాలి. మొత్తానికి బాలయ్యకు అచ్చొచ్చిన సెంటిమెంట్ డైరెక్టర్స్ ని నమ్మడం. అలా వారితో ఒకటికి మించి హిట్లు పడితే ఆ రికార్డే వేరే లెవెల్ లో ఉంటుంది. దటీజ్ బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: