జ‌బ‌ర్ద‌స్త్ షోపై కూడా కాస్టింగ్ కౌచ్ ముద్రా...!

VUYYURU SUBHASH
తెలుగు బుల్లితెర పై ఎన్నో పాపులర్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి... పోతున్నాయి. ఎన్ని ప్రోగ్రాం లు వచ్చినా కూడా బుల్లితెరపై గత నాలుగు సంవత్సరాలలో జబర్దస్త్ ప్రోగ్రాం కు... కార్తీకదీపం సీరియల్ కు వ‌చ్చినంత క్రేజ్ మ‌రే షోకు రాలేదనే చెప్పాలి. ఇక బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం అటు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ కు ...ఇటు ఈ టీవీ కి కాసుల వర్షం కురిపిస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ షో తో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఎంతోమంది ఇప్పుడు వెండితెర మీద కూడా విజృంభిస్తున్నారు. అయితే త్వరలోనే జబర్దస్త్ బాంబ్ పేలిపోనుంద‌న్న టాక్‌ బుల్లితెర వర్గాల్లో వినిపిస్తోంది.
రోజురోజుకు జబర్దస్త్ రేటింగ్ లో పడిపోతున్నాయి. ఒకప్పుడు 17 - 18 రేటింగ్ లో వచ్చిన జబర్దస్త్ ప్రోగ్రాం రేటింగ్‌..  ఆ తర్వాత 12 - 14 మ‌ధ్య‌కు ప‌డియిపోతుంది. మరోవైపు యూట్యూబ్ లో కామెడీ చేసే వాళ్ళ సంఖ్య పెరిగి పోవడంతో పాటు జబర్దస్త్ స్కిట్లు అల‌రించ‌క పోగా న‌వ్వు పుట్టిస్తున్నాయి. పైగా ఆ స్కిట్ లు యూట్యూబ్ లో వచ్చేయ‌డడంతో వాటిని టీవీ లో చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో వస్తున్న ప్రోగ్రామ్‌లోనే ఇప్పుడు జబర్దస్త్ న‌టులు కూడా కనిపిస్తున్నారు. ఈ రెండు ప్రోగ్రామ్ ల కంటెంట్ లో పెద్ద తేడా లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ బుడ‌గ పేలిపోనుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే వెండితెరను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఇప్పుడు జబర్దస్త్ కు కూడా దాపురించిందని ప్రచారం జరుగుతోంది.
కొంతమంది లేడీ ఆర్టిస్టుల‌ను జ‌బ‌ర్ద‌స్త్ స్టార్స్‌ ఇబ్బంది పెడుతున్నారట‌. జబర్దస్త్ లో ఒకరిద్దరు స్టార్ ల వల్ల అక్కడ పనిచేస్తున్న ఆర్టిస్టులు అందరూ జబర్దస్త్ కోసం మ‌రోసారి అగ్రిమెంట్ చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదని ...దీంతో ఒకరిద్దరు లేడీ ఆర్టిస్టులు అయితే మీడియా ముందుకు వచ్చి బాంబు పేలుస్తారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: