నాగార్జునను ఆదుకున్న మెహ్రీన్ !

Seetha Sailaja

సీనియర్ హీరోల హీరోయిన్స్ కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. దీనితో బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ చిరంజీవి సినిమాలకు హీరోయిన్స్ దొరకడం చాల కష్టంగా మారింది. వెండి తెర మన్మధుడుగా పేరుగాంచిన నాగ్ కు ఏర్పడిన హీరోయిన్ కష్టాలను తీర్చడానికి ఇప్పుడు మెహ్రీన్ ముందుకు వచ్చింది.

ఈమె పెళ్ళి క్యాన్సిల్ అయిన దగ్గర నుండి వరసపెట్టి సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ టాప్ యంగ్ హీరోల దృష్టి ఈమె పై పడటం లేదు. దీనితో ఆమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో నాగార్జున నుండి వచ్చిన పిలుపుకు ఆమె వెంటనే ఒకే చెప్పి హీరోయిన్స్ రేస్ లో ముందు వరసలో ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున ‘ది ఘోస్ట్’ అనే మూవీని చేస్తున్నారు. హర్రర్ మూవీగా తీయబడుతున్న ఈమూవీలో మొదట కాజల్ ను తీసుకున్నారు. అయితే ఆమె గర్భవతి కావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆతరువాత ఈ మూవీ యూనిట్ అమలా పాల్ కోసం ప్రయత్నించింది కానీ ఆ ప్రయత్నాలు సక్సస్ కాలేదు.

ఆతరువాత ముంబాయి నుండి ఒక యంగ్ హీరోయిన్ ను తీసుకు వచ్చారు కానీ ఆమె నాగ్ పక్కన మరీ చిన్న పిల్లలా కనిపించిందట. దీనితో అనేక ఆలోచనలు చేసి మెహ్ర్రిన్ ను ఈమూవీ కోసం ఎంపిక చేసారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ మూవీ షూటింగ్ బిగ్ బాస్ హడావిడి పూర్తి అయిన తరువాత ఈమూవీ షూటింగ్ ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం గోపీ చంద్ మలినేని బాలకృష్ణతో తీస్తున్న మూవీకి కూడ హీరోయిన్ సమస్యలు ఉన్నాయి. శృతి హాసన్ ను సంప్రదిస్తే ఆమె బాలయ్య పక్కన నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అంటున్నారు. ఇప్పుడు మెహర్రిన్ నాగ్ పక్కన నటిస్తోంది కాబట్టి రానున్న రోజులలో బాలయ్య హీరోయిన్ కష్టాలను ఈమె తీర్చగలిగితే బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్ కష్టాలు తప్పుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: