అఖండ : అబ్బా..... ఆ రణగొణ ధ్వనులేంటి థమన్ .... ??

GVK Writings
బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కలయికలో గతంలో తెరకెక్కిన తొలి మూవీ సింహా సూపర్ హిట్ కొట్టింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఆ సినిమా 2010లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత నాలుగేళ్ళ అనంతరం 2014లో మరొక్కసారి బాలయ్య, బోయపాటి చేసిన సినిమా లెజెండ్. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఆ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి వీరిద్దరి కాంబినేషన్ కి అందరిలో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక మళ్ళి ఏడేళ్ల తరువాత ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం చేసిన మూవీ అఖండ.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించారు. నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చిన అఖండ మూవీ అనుకున్న స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన బాలయ్య తన రెండిట్లోనూ తన మార్క్ పెర్ఫార్మన్స్, స్టైల్, డైలాగ్స్ తో సూపర్ గా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. అయితే మూవీలో బాలయ్య యాక్టింగ్ సూపర్ గా ఉన్నప్పటికీ బోయపాటి కథ, కథనాలు మాత్రం అంత ఆసక్తికరంగా లేవని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు సినిమాకి మంచి సాంగ్స్ అందించిన థమన్, సినిమాలో అందించిన బీజీఎమ్ మరీ శృతిమించిందనేది కొందరు ప్రేక్షకులు చెప్తున్న మాట. సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఫైట్స్ ఉండడం అలానే వాటికి భీకర స్థాయిలో ఆడియన్స్ కి ఒకింత విసుగు వచ్చేలా థమన్ బీజీఎమ్ ఇచ్చారని, అందుకే థియేటర్స్ లో ఆ సీన్స్ చూసినపుడు వచ్చిన సౌండ్ కి తమకి కొంత ఇబ్బంది కలిగిందని మరికొందరు అంటున్నారు. థమన్ నిజానికి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని, కానీ ఇలా ప్రతి యాక్షన్ సీన్ కి ఇంతలా మ్యూజిక్ ఇవ్వాలా అంటూ మరికొందరు అంటున్నారు. మొత్తంగా అఖండ లో ఎక్కువగా మాస్, యాక్షన్ అంశాలు మాత్రమే ఉండడం, అవి కూడా ఫక్తు బి, సి సెంటర్ ఆడియన్స్ కి అలానే బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతాయనేది మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్న మాట. మరి రాబోయే రోజుల్లో అఖండ ఎంత కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: