అఖండ : సినిమా ఆ మాత్రమైనా నిలబడడానికి కారణం బాలయ్యే ... ??

GVK Writings
నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీగా నిర్మించిన ఈ సినిమా లో యువ నటి ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, ప్రభాకర్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే పాపులర్ అయ్యాయి.
ఇక నేడు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అఖండ మూవీ పెద్దగా సక్సెస్ టాక్ ని అయితే అందుకోలేకపోయింది. కథ పరంగా మంచి పాయింట్ ని ఎంచుకున్న బోయపాటి దానిని ఆడియన్స్ ని అలరించేలా తీయడంలో మాత్రం విఫలం అయ్యారనే చెప్పాలి. పక్కాగా కేవలం బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఊర మాస్ ఫైట్స్, యాక్షన్ సీన్స్, సాగతీత సన్నివేశాలు ఎక్కువగా సినిమాలో ఉన్నాయని, ముఖ్యంగా సినిమాలో కథనం లోపమే పెద్ద మైనస్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. థమన్ అందించిన సాంగ్స్ కి ట్ బాలయ్య సూపర్ గా స్టెప్స్ వేయడంతో పాటు అటు సినిమాలోని రెండు పాత్రలకు జీవం పోశారు అనే చెప్పాలి. ముఖ్యంగా అఘోరా పాత్రలో ఆయన పలికిన డైలాగ్స్ అయితే మరింత బాగున్నాయి.
సీనియర్ హీరో అయినప్పటికీ కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాలయ్య ఈ సినిమాలో తన నటనతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని సైతం ఆకట్టుకున్నారు. అయితే సినిమాలో సగటు ప్రేక్షకులు కోరుకునే అంశాలు పెద్దగా లేకపోవడంతో అఖండ సినిమాపై చాలా మంది ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సినిమాలో గ్రాండియర్ లుక్స్, ఫైట్స్, మాస్ సీన్స్ పై దృష్టిపెట్టిన దర్శకుడు బోయపాటి కథ పై మరింతగా దృష్టి సారించి ఉంటె బాగుండేదని పలువురు ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో అఖండ ఎంత మేర టాక్ తో ఏ స్థాయి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: