ఆచార్యా.. ఎందుకీ అన్యాయం... ?

Satya
మెగాస్టార్ అంటేనే ఆయన పేరు తలచుకుంటేనే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. ఆయన మూవీస్ కోసం అలా వెయిట్ చేసే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. వారికి మెగా అన్న మాట వేద వాక్యమే. మెగాస్టార్ సినీ డైరీని లేటెస్ట్ మూవీస్ వివరాలను అలా ఒకటికి పదిసార్లు చదివేస్తూ వారు ఉప్పొంగిపోతారు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ మూవీ రిలీజ్ అయి అచ్చంగా రెండేళ్ళు పై దాటింది. 2019 దసరాకు సైరా మూవీ వచ్చింది. అది హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ. దాంతో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వలేకపోయింది. అయితే ఇపుడు ఆచార్య మూవీ అది కూడా కొరటాల శివ డైరెక్షన్. రామ్ చరణ్ తొలిసారి బాగా నిడివి ఉన్న పాత్రను తండ్రి పక్కన నటిస్తూండడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో ఈ మూవీ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అయితే ఈ మూవీని ముందు ఈ ఏడాది వేసవి అన్నారు, తరువాత దసరా అన్నారు, ఆనక డిసెంబర్ అన్నారు, ఇపుడు తీసుకెళ్ళి ఫిబ్రవరికి తోసేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ బాధ ఒక్కలా లేదుట. ఆచార్యా ఏంటి ఈ అన్యాయమని వారు గోల పెడుతున్నారు. సినిమా ఎపుడో పూర్తి అయినా ఇన్నాళ్ళా రిలీజ్ కి అని కూడా వాపోతున్నారు. పైగా ఫిబ్రవరి డ్రై మంత్ అని, ఎగ్జాంస్ సీజన్ అని వారు మధన పడుతున్నారుట. రిలీజ్ కి కరెక్ట్ గా డిసెంబర్ అయినా సరైన టైం అని వారు అంటున్నారు. కానీ ఆచార్య అలా వెనక్కి వెళ్ళిపోయాడు. మరి అంతవరకూ వారు అలా వేచి చూడడమే. అయితే ఈ లోగా ఇతర హీరోల మూవీస్ అలా వచ్చి సందడి చేస్తున్నాయి. ఆ హోరును, జోరుని తట్టుకోవడం మెగా ఫ్యాన్స్ వల్ల కావడంలేదుట. మరి ఆచార్య మేకర్స్ మాత్రం ఏం చేస్తారు. సరైన డేట్ లేకనే వెనక్కి వెళ్ళారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: