అఖండ : శాతకర్ణిని మించిన కలెక్టన్ లు 150 కోట్లు బిజినేస్ అంటున్న అభిమానులు

Vennelakanti Sreedhar

సినిమా రిలీజ్ కు ముందే హ్యాట్రిక్  హిట్  గా పేరు తెచ్చుకున్న చిత్రం అఖండ. . హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి అందగాడు  బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఇప్పటికే  యాభై కోట్లుకు పైగా బిజినెస జరిగినట్లు సినిరంగ పెద్దలు పేర్కోంటున్నారు.  కోవిడ్-19  వరుస వెంబడి తన ప్రతాపాన్ని చూపుతున్న వేళ అఖండ సినిమా పై  నందమూరి అభిమానులు చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఓమిక్రాన్ వేరియంట్  వార్తలు జనాల్ని భయపెడుతున్న వేళ ఈ చిత్రం విడుదలఅవుతందా? లేక మరి కొద్ది కాలం వాయిదా పడుతుందా అన్న  వార్తలు గత పక్షం రోజులుగా హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. సినీ రంగాల సమాచారం ప్రకారం బాలకృష్ణ సినీరంగ లో ఎక్కువ కలెక్షన్ లు  తన ఖాతాలో వేసుకున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా  షేర్ కేవలం యాభై కోట్లు రూపాయలు మాత్రమే.
అఖండ సినిమా  బిజినేస్ ప్రాంతాల వారీగా భారీగానే నమోదైంది. సినీరంగ పెద్దల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  ఓవర్సీస్ హకుకులు 2.47 కోట్లు,  భారత దేశం వెలుపల- 4.40 కోట్లు, నెల్లూరు -1.89 కోట్లు,  కృష్ణ- 3.82 కోట్లు,  గుంటూరు-5.49 కోట్లు, నైజాం- 11.00 కోట్లు,  ఉత్తరాంధ్ర 5.80,  |ఈస్ట్ 3.95, వెస్ట్ - 3.44 , సీడెడ్ 11.00 కోట్లు, గా రికార్డు సృష్టించింది.
కోవిడ్-19 సెకండ్ వేవ్ తరువాత సినిమా ధియోటర్లులో రిలీజ్ అవుతున్న భారీ చిత్రం ఇది. బాలకృష్ణ సినీరంగ  ప్రస్థానంలో గౌతమీ పుత్ర శాతకర్ణి తన కంటూ ప్రత్యేక రికార్డును నమోదు  చేసింది. ఆ రికార్డును అఖండ బ్రేక్ చేస్తుందని అభిమానులు పేర్కోంటున్నారు. సామాజిక మాధ్యమాలలో  అంతా కూడా అఖండ బిజినెస్ కు సబంధించిన అంశాలే ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. ఏ సినిమాకయినా సంగీతం ప్రధానం. ఈచిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో బాలకృష్ణకు తమ్ముడుగా, విలన్ గా తనదైన నటనను ప్రదర్శించారు. ఇక నందమూరి అందగాడి సంగతి చెప్పనక్కర లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: