కరెక్ట్ కాదు... టికెట్ రేట్లపై రాఘవేంద్రరావు వ్యాఖ్యలు

Vimalatha
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై గత కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు ఒకే టికెట్ రేటు ఫిక్స్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పై సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్నా టాలీవుడ్ పెద్దలు అంతా ఒక్కొక్కరుగా నోరు తెరిచి తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ విషయంపై స్పందించారు. ఏపీలో సినిమా షో లు టికెట్లపై తగ్గింపు కరెక్ట్ కాదంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నలభై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా తాను ఇలాంటి అత్యున్నత స్థాయిలో ఉండటానికి ప్రేక్షకులు థియేటర్ మరియు పంపిణీదారులు కారణమని ఆయన అన్నారు.
ఇక కామన్ మాన్ కు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే అనే విషయాన్ని గుర్తు చేశారు ఆయన. సినిమా థియేటర్ లో చూసిన అనుభూతి టీవీలో రాదని, షోలు టికెట్ రేట్లు తగ్గించడం వల్ల అందరు నష్టపోతారని తెలిపారు. 100 సినిమాల్లో హిట్ అయినవి 10 శాతం మాత్రమేనని, ఆన్లైన్ వలన దోపిడి ఆగిపోతుంది అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు 300 పెట్టినా చూస్తాడని, లేదా 500 పెట్టిన ఖర్చు చేస్తాడని, సినిమా నచ్చకపోతే టికెట్ రూపాయికి అమ్మిన ఎవరు చూడాలని, ఆన్లైన్ వల్ల ఇన్ఫ్లూయెన్స్ ఉన్నవారు బ్లాక్లో టిక్కెట్లు అమ్మే అవకాశం ఉంటుందని, టికెట్ రేట్లు పెంచి ఆన్లైన్ లో ఉండడం వల్ల టాక్స్ ఎక్కువ వస్తుంది అంటూ రాఘవేంద్రరావు ఏపీ ప్రభుత్వం తీరుపై తన అసంతృప్తిని తెలిపారు. మరోవైపు ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న వరదల బీభత్సం కారణంగా ఎంతోమంది దారుణంగా నష్టపోయారు. అయితే దానికి నష్టపోయిన బాధితులకు సినిమా ఇండస్ట్రీ నుంచి సాయం అందించడానికి సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: