ఇది కదా అభిమానుకు కావాల్సింది..బాల‌య్య‌తో సంద‌డి చేయనున్న మ‌హేశ్‌బాబు..!!

VUYYURU SUBHASH
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నా..నందమూరి నటసింహం బాలయ్య అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం.. అడిగిన వారికి లేదు అనకుండా పెట్టే గుణం.. ఆయన తండ్రి దగ్గర నుంచే వచ్చి ఉంటుంది. తండ్రి నందమూరి తారక రామారావు లాగే అటు సినిమాలోను ఇటు రాజకీయాలోను తనదైన ముద్ర వేసుకుని దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇక ఈ మధ్యనే ఆయన లోని కొత్త టాలెంట్ ని కూడా బయటకు పరిచయం చేస్తూ.. హోస్ట్ గా కూడా మారాడు.
‘ఆహా’ ఓటీటీ వారితో కలిసి.. సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే టాక్ షోను చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో ఎపిసోడ్స్ సంచలనమైన రికార్డ్స్ నెలకొల్పాయి. మొదట ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రెండో ఎపిసోడ్ కి నేచురల్ స్టార్ నాని వచ్చి బాలయ్య తో మస్త్ సందడి చేసారు. ఫన్నీ గా ఆటాలు..ఇంకా ఫన్నీగా మాటల తో షో కి బాలయ్య స్పెషల్ అట్రాక్షన్  గా నిలిచారు.  ఇక ఇప్పుడు ఈ టాక్ షో కి మ‌రో టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు..టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సం హీరో ఘట్టమనేని వారసుడు మ‌హేశ్ బాబు రాబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా మ‌హేశ్ బాబు ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ న్యూస్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టాక్ షో బాలయ్య తో కలిసి మహేష్ బాబు డ్యాన్స్ చేసారట. మీరు గమనించిన్నట్లైతే మహేష్ బాబు ఇంత  వరకు బయట ఎక్కడ ఏ షో లో కూడా డ్యాన్స్ చేయలేదు. కానీ ఈ టాక్ షోలో బాలయ్య  మహేష్ ని అడగడంతో ఆయన కాదు అనలేక డ్యాన్స్ చేసిన్నట్లు  ఒక‌ వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మొత్తానికి బాల‌య్య‌, మ‌హేశ్ లాంటి అన్ బిలివెబుల్ కాంబినేష‌న్ తెర పై కనిపించనున్నారు అని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అటు బాలయ్య..ఇటు మహేశ్ ఇద్ద‌రు హీరోల అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: