అయ్యో కమెడియన్ లు...? పాపం కదూ...?

Sahithya
మన తెలుగులో ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు కొంత మంది కమెడియన్ల కు సంబంధించి కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాలో ఒక స్టార్ హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ కామెడీ కూడా వాళ్లు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కమెడియన్లు తెలుగులో పెద్దగా కనబడడం లేదనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో బిజీ కావడానికి కొంత మంది కమెడియన్ల కాస్త ఎక్కువగా కష్టపడుతున్నా సరే ఇప్పుడు అనుకున్న విధంగా పరిస్థితులు కనిపించకపోవడంతో చాలా వరకు కూడా కమెడియన్లు సినిమాకు దూరమవుతున్నారు.
కమెడియన్ లకు సంబంధించి తెలుగు సినిమా ఆలోచించకపోతే మాత్రం భవిష్యత్తులో కొంతమంది నటులు రోడ్డున పడే అవకాశం ఉంటుందని ఇతర భాషల్లో కమెడియన్ లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మన తెలుగులో ప్రాధాన్యత ఇవ్వడానికి వచ్చిన నష్టమేంటి అని చాలామంది ప్రశ్నించే పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొందని చెప్పాలి. కొంతమంది కమెడియన్లు తెలుగు సినిమా మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాం సరే రెమ్యునరేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టక పోయినా సరే ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న సరే తెలుగు సినిమా పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు సినిమాలో చాలా మంది కమెడియన్ల గతంలో ప్రభావం చూపించే వారు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరోలు కమెడియన్ల పాత్రలను కూడా పోషించడం తో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో చాలా మంది కమెడియన్ల ఉన్నారని ఈ నేపథ్యంలో కొంతమంది నటులు ఇతర భాషల్లో కూడా చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చాలామంది కమెడియన్లు తెలుగు సినిమా కోసం కష్టపడుతున్న సరే టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్న సరే వాళ్ళను కనీసం ఆదరించే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది సొంత ప్రాంతాలకు  వెళ్లి పోతున్నారు అని అంటున్నారు.మరి దీనిపై సినీ పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: