వెల 'సిరి' : ఎన్ని పాటలు రాశారో.. సమాజం మాత్రం అక్కడే ఉన్నది..!

Chandrasekhar Reddy
చరిత్రలో అనేక మంది ప్రముఖులు సమాజాన్ని ప్రభావితం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందరో సినీ పరిశ్రమలో లాభాల కోసం కాక కేవలం సమాజాన్ని మేల్కొల్పడానికే చిత్రాలను తీస్తూనే ఉన్నారు. అలా చిత్రాలు తీసేవారు కొందరు, అందుకు పాటలు పడేవారు కొందరు ఇలా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆయా సందర్భాలను బట్టి ప్రజలు కొన్ని సార్లు స్పందించారు, చాలా సార్లు అవన్నీ చిత్రాలుగానే మిగిలిపోయాయి కూడా. అయినా సినీ పరిశ్రమ మాత్రం తన వంతు కృషి చేస్తూనే ఉంది. వాళ్ళు కూడా తప్పు జరుగుతుంది జాగర్త పదండి అని చెప్పగలరు, అంతవరకే. దానిని అర్ధం చేసుకొని ప్రజలు మిగితాది చేసుకుపోవాల్సి ఉంటుంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా అలాంటి పాటలు ఎన్నో అందించారు. అందులో చెప్పుకోదగ్గవి అంటే గాయం చిత్రం గుర్తుచేసుకోవాల్సిందే. సమాజంలో యువత  తెలియకుండానే హింసవైపు మళ్లే యాదృచ్ఛికాన్ని ఆ చిత్రంలో దర్శకుడు చూపించాడు. దెబ్బకు దెబ్బ తీయాలనే సంస్కృతి భారతీయులది కాదనేది కధలో నిగూఢంగా ఉన్న నీతి అనే చెప్పాలి. సమాజం మేల్కొనకపోతే రేపటి రోజున ఆయుధం పట్టిన వాడిదే అధికారం అవుతుంది అనేది స్పష్టంగా చెప్పబడింది. ప్రస్తుతం చూడండి, అలాంటి పరిస్థితులలో నే ఉన్నాం కదా. ఆయుధాలు పట్టుకున్న వారు ప్రజాస్వామ్యాన్ని అణిచేస్తున్నారు.
ఇవన్నీ అప్పటి పాటలోనే చెప్పడం ఎంత ముందు చూపు. అయినా సమాజంలో మార్పులు రాలేదు. అందరు భయంభయంగానే స్వాతంత్ర దేశంలో కూడా బ్రతికేస్తున్నారు. ఇలా కొందరు ముందుగానే కొన్ని చెప్తున్నప్పటికీ గ్రహించలేని సమాజం ఉన్నప్పుడు ఆయా దేశాల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే దానికి ప్రస్తుత ప్రపంచంలో గొప్ప లైవ్ ఉదాహరణలే మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలు కేవలం సాధారణంగానే ఉన్నప్పటికీ వాటిలోంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అది పాట ద్వారా పలికించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. స్మరణీయులు, సమాజం ఉన్నతవరకు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: