వెల'సిరి' : తెలుగు సినిమా సాహిత్యానికి వెన్నెలలు అద్దిన సిరివెన్నెల

P.Nishanth Kumar
పాట ఏదైనా ఆయన కలం పడితే అద్భుతమై పోవాల్సిందే. ఎలాంటి పాటనైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా సరళమైన పదాలతో రాసి తెలుగు పాటకు సరికొత్త వన్నె తీసుకువచ్చారు. ఎంతో మంది దర్శకుల ఇష్ట గేయ రచయిత, ఎంతో మంది శిష్యులకు ఆరాధ్య దైవం సిరివెన్నెల. అయన పాటలకు కోట్లాది మంది ప్రేక్షకులు అభిమానులుగా ఉండేవారు. అయితే అయన మరణం ఇప్పుడు అందరికి తీరని లోతుగా మిగిల్చింది. సిరివెన్నెల తెలుగు సినిమా పరిశ్రమకు వెన్నెల ను తీసుకువచ్చి తనతో పాటే తీసుకువెళ్లి ఇప్పుడు చీకటి నీ అందరికీ మిగిల్చారు. సీతారామశాస్త్రి ది అర్థవంతమైన పాటలు అద్భుతమైన పాటలు రాయడంలో అందెవేసిన చేయి. ఎలాంటి పాటతోనైనా ప్రేక్షకులను ఉత్తేజపరిచి వారిని ముగ్ధులను చేసేవారు.

ఆయన కలం నుంచి ఎన్ని గొప్ప గొప్ప పాటలు పురుడు పోసుకున్నాయి. విశ్వనాథ్ గారు ఇచ్చిన తొలి సినిమా నీ ఆసరాగా చేసుకుని తొలి సినిమాతోనే మంచి రచయిత గా నిరూపించుకుని ఇప్పుడు స్టార్ లిరీల్సిస్ట్ గా  ఎదిగాడు. ఎలాంటి పాటనైనా తనకు మించి రాయలేరనే విధంగా తన ప్రతిభ ను ఆయన చాటి చెప్పాడు.  తెలుగు సినిమా పరిశ్రమలో సీతారామశాస్త్రి ఎన్నో పాటలతో మరెన్నో జ్ఞాపకాలతో  ప్రయాణం చేయగా ఇప్పుడు ఆ ప్రయాణానికి వీడ్కోలు పలుకారు 

కొన్నిరోజులు గా న్యుమోనియా అనే అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన మరణానికి కూడా అదే కారణం అని డాక్టర్లు చెబుతున్నారు.  ఏదేమైనా తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కొక్క రుగా మహానుభావులను కోల్పోతూ సినిమా పరిశ్రమకు తీరని లోటు తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎంతో మంది గొప్ప గొప్ప రచయితల వారసత్వాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పాటలను రాసిన ఆయన లేని ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. ఆయన శిష్యులు చాలామంది టాలీవుడ్ లో మంచి గేయ రచయితలు గా కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: