వెల 'సిరి' : సినీ పరిశ్రమకు.. మరో లోటు..!

Chandrasekhar Reddy
సినీ పరిశ్రమ మరో గొప్ప రచయితను కోల్పోయింది. ఆయన పాట రాసినా పాడినా వెంట్రుకలు నిక్కబొడుచుకోవాల్సిందే. కరోనా వచ్చినప్పటి నుండి గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ముఖ్యంగా సినీ పరిశ్రమ వారు దూరం అయిపోతున్నారు. బాలసుబ్రమణ్యం గారి విషయం మరువక ముందే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా మరణించారు. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన వారందరు ఇలా దూరం అయిపోవడం అందరిని కలచివేస్తుంది. ఇప్పటికే పరిశ్రమ నష్టాలతో అతలాకుతలం అయిపోతుంటే, పుండుమీద కారం చల్లినట్టే ఉంది ఈ గొప్పవాళ్ళ మృతులు. ఒకరకంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోతుంది అనాల్సి వస్తుంది. మరణం ఎవరికైనా సహజమే అయినప్పటికీ, ఒప్పుకోవడం సామాన్యుల తరం కాదని ఇలాంటివి జరిగినప్పుడే తెలిసొస్తుంది.
పరిశ్రమలో ఎందరో కొత్త గాయకులు, రచయితలూ వచ్చి ఉండొచ్చుగాక, ఆ పాతమదురాల కోసం పడిచచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకే కొందరికి వయసుతో పనిలేని అభిమానులు తరాలు మారినా వస్తూనే ఉన్నారు. నేడు మంచి రోజు కావచ్చుగాక, కానీ పాటలంటే పడి చచ్చే వాళ్లకు మాత్రం ఇలాంటి రోజులు బాధనే మిగులుస్తాయి. ఆయా పాటలు వింటున్నప్పుడల్లా ఇప్పటివరకు వినపడిన లేదా కనపడిన గొంతుక ఇక లేదనే విషయం జీర్ణించుకోవడం కాస్త కష్టమే. అందుకే అన్నారేమో నిజం నిష్ఠురం అని. అందుకే చేదైన నిజం కంటే పక్కవారి సంతోషం కోసం తీపి అబద్దం చెప్పడం తప్పఏమీ కాదని ధర్మ గ్రంధాలు కూడా చెప్పేశాయి.
ఏమైనా ఇది అబద్దం చెప్తే నమ్మేసే సందర్భం కాదు కాబట్టి కొన్నిటిని జీర్ణించుకోక తప్పదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. వీరు 1984లో సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అదికూడా మొదటిసారిగా నటులు బాలకృష్ణ గారి చిత్రం తో పరిచయం అయ్యారు. అనంతరం కే.విశ్వనాధ్ గారి కంట్లో పడ్డారు, సిరివెన్నెల చిత్రం లో ఆయనతో కలిసి పనిచేశారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది, దానితో ఆయనకు ఆ చిత్రం ఇంటి పేరు అయిపోయింది. నిజానికి అంతకముందు వరకు ఆయన చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో 20 మే, 1955 న ఆయన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: