రాజకీయాలు ఆ ఇద్దరి సినిమా కెరీర్ ను నాశనం చేశాయా?

VAMSI
అప్పట్లో తెలుగు ప్రజల అన్నగారు ఎన్టీఆర్ మొదలుకుని ఎందరో నటీనటులు సినిమాల నుండి రాజకీయాల వైపు అడుగులు వేశారు. కొందరు సినీ పరిశ్రమను విడిచి పూర్తిగా రాజకీయాలకే అంకితం కాగా, చాలా మంది అటు పాలిటిక్స్ ని ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ నుండి రాజకీయాల వైపు మర్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. అయితే కొందరు నటులు రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల్లో అవకాశాలను కోల్పోతున్నారు. రాజకీయ జీవితం వలన సినీ జీవితానికి వారు దూరమవుతున్నారు. అలాంటి వారిలో పోసాని కృషణమురళి మరియు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ బాగ్ ఫేమస్ అయిన నటుడు పృధ్వీ కూడా ఉన్నారు. దీనికి పలు కారణాలు వ్యక్తమవుతున్నాయి.
నటులు ఏ పార్టీలో ఉన్నా సెట్ లోకి అడుగుపెట్టాక  అంతా ఒకటిగా కలిసిపోయేవారు. రాజకీయ వాతావరణం మరియు ఆ  ఎఫెక్ట్ ఇండస్ట్రీపై పడేది కాదు. కానీ ఇప్పుడు ఈ తీరు మారిందని పార్టీలను బట్టి సినిమాల్లో అవకాశాలు అందుతున్నాయని కొన్ని చేజారుతున్నాయని కొందరు నటులు వాపోతున్నారు. ఈ మధ్య ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సినీ పరిశ్రమలో ఉన్న టిడిపి వారు ఎక్కువగా ఉన్నారని వాళ్లు తమకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిభ ఉండి అనుభవం ఉన్నప్పటికీ వైసిపిలో ఉన్నందున టీడీపీ వాళ్లు కావాలని టార్గెట్ చేసి ఛాన్సులు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
పోసాని కృష్ణ మురళి, పృద్వి రాజ్ వంటి వారు ఏళ్ల తరబడి ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగానే ఉండే వారు. అలాంటి వారు నేడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు అంటే ఆలోచించాల్సిన విషయమే మరి. వీరు చెబుతున్నట్టు వీరికి అవకాశాలు రాకపోవడం వెనుకున్న కారణం ఇదేనా లేదా ఇంకేమైనా ఉన్నదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: