వారికి ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించిన నాని!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ఇండస్ట్రీ లో జరుగుతున్న పలు పరిణామాలు ఎన్నో వివాదాలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వ్యవహారం ఇప్పటికీ తేలకపోవడం పట్ల సినిమా వారు ఎంతో నిరాశగా ఉన్నారు. తప్పకుండా ఇది తేలాల్సిన విషయం గా ఉండటంతో వారికి ఈ విషయం ఇంకా క్లారిటీ లేకపోవడం అందరికీ ఎంతో నిరాశ పరుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సినిమా వారికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు. సినిమా వారికి భారీ నష్టం చేకూర్చే విధంగా ఈ నిర్ణయం ఉండడంతో ఎంతో మంది సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్నా కూడా వారి మనసు కరగలేదు.

అయితే ఎవరు స్పందిస్తే వారి మీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడంతో ఎవరు ముందుకు వచ్చి దీనిపై మాట్లాడడానికి సాహసం చేయలేక పోతున్నారు. గతంలో ఒక ఉదాహరణ ఇప్పుడు ఏ హీరో కూడా మాట్లాడక పోవడానికి కారణం అయింది. కరోనా సమస్య వచ్చిన తర్వాత థియేటర్ ఓపెనింగ్ సమస్య వచ్చినప్పుడు హీరో నాని తన సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని నిర్ణయం చేసినప్పుడు ఒక సారిగా ఆయన పై భారీగా విమర్శలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యాజమాన్యాలు అన్నీ కూడా ఆయనపై భారీగా విరుచుకు పడ్డాయి.

ఒకానొక దశలో ఆయనను బాయ్ కాట్ చేయలని విధంగా వారు విమర్శలు చేశారు. కానీ కొంతమంది పెద్దల జోక్యంతో ఇది సద్దుమణిగి పోయింది.  ఒక సినిమాను విడుదల చేయాలంటే నిర్మాత ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. హీరో దానిని ఆచరించడం మాత్రమే అన్న ప్రధమ సూత్రం తెలిసిన వారు కూడా ఆ విధంగా విమర్శలు చేయడం పట్ల నాని అప్పట్లో చాలా బాగా ఫీలయ్యాడట. ఇకపోతే తాజాగా ఆయన టికెట్ రేట్ల విషయం పై మాట్లాడాల్సిందిగా కొంతమంది అడగగా దీనిపై తాను స్పందించక పోవడం మంచిది అని చెప్పి దానిపై స్పందించాల్సిన వారు వేరే ఉన్నారని ఆయన చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఆయన సినిమా పెద్దలకు అయన చురకులు అంటించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: