బాలయ్య మళ్లీ వేసవికి వచ్చేస్తారా...?

Sahithya
ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ వేగంగా సినిమాలు చేయడం కాస్త అభిమానులను సంతోష పెట్టే విషయం గా చెప్పాలి. గతంలో నందమూరి బాలకృష్ణ వేగంగా సినిమాలు చేసినా సరే సినిమాల విడుదల విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అవుతూ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం బాలకృష్ణ వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ వాటిని వేగంగా విడుదల చేసే దిశగా అడుగులు వేయడం ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత దాదాపుగా మూడు సినిమాలను లైన్ లో పెట్టడం తో నందమూరి అభిమానులు ఆయన సినిమాల గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా విడుదలైన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే విధంగా బాలకృష్ణ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ ఇప్పటికే గోపీచంద్ మలినేనికి డెడ్ లైన్ కూడా పెట్టారని అలాగే సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేయడమే కాకుండా దాదాపు మూడు నెలల్లో అన్ని విధాలుగా కూడా సినిమా పనులు పూర్తయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక సినిమాకు సంబంధించి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని గతంలో ఒక సినిమా విడుదలై ఆ సినిమా విజయం సాధించిన ఫ్లాప్ అయినా సరే తర్వాత సినిమా విషయంలో కాస్త ఎక్కువగా జాగ్రత్తపడే బాలకృష్ణ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముందు నుంచి కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా బాలకృష్ణ బరువు కూడా కాస్తంత తగ్గే అవకాశం ఉందని అదే విధంగా ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసే సూచనలు కూడా ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏం చేయబోతున్నారు అభిమానులను ఏ విధంగా అలరించబోతున్నారు అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: