అనిల్ రావిపూడి ఆ సినిమా ను హ్యాండిల్ చేయగలడా!!

P.Nishanth Kumar
వరుస విజయాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం పటాస్ ఏ రేంజిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేసిన రాజా ది గ్రేట్ మరియు f2 చిత్రాలు కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకొని ఆయనను స్టార్ దర్శకుడిగా మార్చాయి. ఇక మహేష్ బాబు తో ఆయన చేసిన సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా భారీ గా విజయవంతం కావడంతో ఒక్కసారిగా ఆయన పై అందరి హీరోల కన్ను పడింది.

ఆ క్రమంలోనే ఇప్పుడు ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తూ ఉండగా తాజాగా ఈ లిస్ట్ లోకి చిరంజీవి కూడా వచ్చి చేరాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి కొరటాల శివ కాంబో లో వస్తున్న ఈ సినిమా తర్వాత మోహన్ రాజా,  మెహర్ రమేష్ బాబీ లతో కలిసి సినిమాలు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువ అవుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ తీయడంలో చేయి తిరిగిన అనిల్ రావిపూడి కి తిరుగులేని మెగాస్టార్ కలిస్తే తప్పకుండా అది ఒక మంచి సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఈ సినిమా రావడం ఖాయమని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అనిల్ బాలకృష్ణ సినిమా తర్వాత మెగాస్టార్ సినిమా చేయనున్నాడని వార్త లు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: