11 నంది అవార్డులు అంటే మాటల.. సిరివెన్నెల పెన్నుతనం!!

P.Nishanth Kumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గీత రచయితగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకొని ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఏ రచయితకు దక్కని విధంగా 11 ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుని చరిత్ర సృష్టించారు. ఆయన గీత రచయితగా పరిచయమైన తొలి సినిమాతోనే 1986వ సంవత్సరంలో నంది అవార్డును అందుకున్నారు.

ఆ సినిమాలోని విధాత తలపున అనే పాట ఆ రోజుల్లో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట వస్తే మార్చకుండా ప్రేక్షకులు ఆ పాట యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారు. ఇక ఆ తరువాత సంవత్సరం శృతి లయలు సినిమాలో తెలవారదేమో అనే పాటకు ఆయన అందించిన సాహిత్యం కు రాష్ట్ర ప్రభుత్వ మరొకసారి నంది అవార్డు ఆయనకు అందజేసింది. ఇక వెంకటేష్ నటించిన స్వర్ణకమలం సినిమా లోని పాటలకు మంచి స్పందన రావడం తో నంది అవార్డు కూడా వచ్చింది.

ఇక ఆ తర్వాత గాయం, శుభలగ్నం, శ్రీకారం, సింధూరం, ప్రేమ కథ, చిత్రం, గమ్యం,  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మహాత్మ వంటి చిత్రాల కు ఆయన నంది అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా ఇతర ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. సినిమాలకు మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కి కూడా ఆయ న పాటలు అందించారు. బుల్లితెరపై తులసిదళం అనే సీరియల్ కు కూడా ఆయన పాటలను అందించి గొప్ప సాహితీవేత్తగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ప్రేమ గీతాలను యుగళ గీతాలను విప్లవ గీతాలు అలాగే రొమాంటిక్ గీతాలను ఏ పాట అయినా సరే తనదైన శైలిలో ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో సులువైన పదాలతో రాసి సిరివెన్నెల ఇప్పుడు ఇంత టి స్థాయికి చేరుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: